Rashmika Mandanna: ‘నేనేమీ హీరోని కాదు అంత తీసుకోవడానికి’.. రెమ్యునరేషన్ పుకార్లపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆమె పారితోషికం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ అని, ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో వసూలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమె రెంజ్ ని బట్టి ఇలాంటి వార్తలు రావడం కామన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై రష్మిక చాలా సరదాగా, అంతే స్పష్టంగా స్పందించారు.
Also Read :Rashmi Gautam : అడ్డుగా ఉన్నాయని కుక్కలను చంపేస్తారా.. రేపు అమ్మానాన్నలను కూడా అంతేనా?
Also Read
‘నేను ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటానని అందరూ అనుకుంటున్నారు, కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. అది కేవలం ఒక అపోహ మాత్రమే. నేనేమీ హీరోను కాదు కదా.. అంత భారీ స్థాయిలో పారితోషికం తీసుకోవడానికి’ అంటూ ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆ వార్తలు నిజమైతే బాగుండేదని తాను కూడా కోరుకుంటున్నానని ఆమె తెలిపింది. అలాగే తమ కెరీర్ ప్రయాణం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను రష్మిక ఈ సందర్భంగా పంచుకున్నారు.
2016 లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తాను ఇప్పటివరకు ఒకే రకమైన అంకితభావంతో పనిచేస్తున్నానని ఆమె తెలిపారు. అలాగే భాషా పరమైన హద్దులు పెట్టుకోకుండా కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నానని చెప్పారు. కేవలం డబ్బు కోసమే కాకుండా, నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని రష్మిక స్పష్టం చేశారు. మొత్తానికి కష్టపడి పని చేయడమే తన బాధ్యత అని రష్మిక ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు