Sanjay Raut: కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తిరిగి వస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద బెయిల్‌పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా 40 మంది శివసేన ఎమ్మెల్యేలు జూన్‌లో పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.
“వారిలో కొందరు ఖచ్చితంగా తిరిగి వస్తారు. మరికొందరు తిరిగి వస్తారని నాకు నమ్మకం ఉంది” అని సంజయ్ రౌత్ అన్నారు.తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీని వీడడానికి కారణాలు చెబుతున్నారన్నారు.పీఎంఎల్‌ఏ కేసుల్లో శీఘ్ర బెయిల్‌కు అవకాశం లేదని, రాజకీయ పగతో ఇలాంటి కేసులు చాలా వరకు నమోదయ్యాయని రాజ్యసభ ఎంపీ తెలిపారు. ఈ కేసులను పరిశీలించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా విపక్ష సభ్యుల అధిక ప్రాతినిధ్యంతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ బెంచ్ ఉండాలని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని రౌత్ చెప్పారు. పేదలకు గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఫడ్నవీస్‌ను ఆయన అభినందించారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
కేంద్రంపై దాడి చేస్తూ, దేశంలో రాజకీయ శత్రువును దేశానికి శత్రువుగా చూసే పరిస్థితి ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు శాశ్వతంగా ముగించే పరిస్థితులు దేశంలో కనిపిస్తు్న్నాయని రౌత్ అన్నారు.దేశంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏడాది కంటే ఎక్కువ కాలం జైలు నుంచి బయటకు రాలేడని అన్నారని రౌత్ చెప్పారు.ఒక గంట జైలులో ఉండటం 100 రోజులకు సమానం, ఎందుకంటే ఒకరికి లోపల ఎటువంటి సౌకర్యాలు లేవు, అని సేన నాయకుడు తెలిపారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో తాను భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని, ఇది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమానమని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే దేశాన్ని నడిపించగల సమర్థులు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేలు దేశాన్ని నడిపించగల సామర్థ్యం ఉన్న ఇద్దరు ప్రముఖ యువ నాయకులు అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు. అంతకుముందు రోజు గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఠాక్రే పాల్గొన్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలైన రౌత్, భారత్ జోడో యాత్రలో శివసేన భాగమని చెప్పారు. రాష్ట్రం, దేశం కోసం పని చేసే శక్తి వారికి (రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే) చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరణం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను పెద్ద శక్తిగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!