Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేడే సైకిల్ ట్రాక్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లో ప్రజలకు మరిన్ని మౌళిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తుంది. అల పలు ఫ్లైఓవర్లు ఇప్పటికే పూర్తై వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి.. మరికొన్ని ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉండగా.. ఇక నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, సైక్లిస్టులను ప్రోత్సహించేందుకు హెచ్ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో సైకిల్ ట్రాక్‌ల నిర్మాణానికి హెచ్ఎండీఏ అధికారులు శ్రీకారం చుట్టారు.
Read Also: Debt: దేశంలో ప్రతి వ్యక్తి పై ఎన్ని లక్షల అప్పు ఉందో తెలిస్తే షాక్ అవుతారు
Also Read
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
అందులో భాగంగానే.. ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో 100 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రతిష్టాత్మక సైకిల్ ట్రాక్‌ను ఇవాళ (ఆదివారం) సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దక్షిణ కొరియాలో ఉన్న సైకిల్ ట్రాక్ తరహాలో భారత దేశంలోనే ఆ స్థాయిలో తొలి సైకిల్ ట్రాక్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు.
Read Also: ICC World Cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించని జట్లు ఇవే.. లిస్టులో పాకిస్తాన్ కూడా!
ఇక, కొల్లూరు నుంచి నార్సింగి వరకూ, నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకూ మొత్తం 23 కిలో మీటర్ల మార్గంలో ఈ ట్రాక్‌ను హెచ్ఎండీఏ ఏర్పాటు చేసింది. సైకిల్ ట్రాక్ పొడవునా సోలార్ రూఫ్ టాప్ సైతం ఉంది. సోలార్ పలకల నుంచి వచ్చే విద్యుత్‌ను ట్రాక్ అవసరాల కోసం ఉపయోగించనున్నారు. ట్రాక్ పొడవునా అద్దె సైకిళ్లు, సైకిల్ రిపేరింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. రైడర్లు విశ్రాంతి తీసుకునేందుకు కెఫెటేరియా లాంటి వసతులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజావార్తలు
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
-
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!