Miyapur Crime: కూతురు పుట్టినరోజుకు వచ్చిన తండ్రి.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్ లోని ఓ సాప్టర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి తనకూతురు పుట్టినరోజు సందర్బంగా నగరానికి వచ్చాడు. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు చేద్దామని అనుకున్నాడు. కానీ.. విధి వక్రిస్తుందని ఆలోచించలేకపోయాడు. ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు టెర్రస్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
విజయవాడకు చెందిన నాగ సందీప్(32), భార్య సింధూజ, కూతురుతో కలిసి దీప్తీశ్రీనగర్‌లోని విశ్వం ఎలైట్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. నాగ సందీప్ దుబయ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల క్రితం కూతురు పుట్టిన రోజు సందర్భంగా నగరానికి వచ్చాడు. బుధవారం సాయంత్రం సోదరుడు కార్తీక్ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి ఇంట్లోకి వెళ్లకుండా ఐదు అంతస్తుల టెర్రస్‌పైకి వెళ్లి కూర్చొని ఆన్‌లైన్ వర్క్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ల్యాప్‌టాప్‌తో సహా కిందపడ్డాడు. రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. ఉదయం 5.30 గంటల సమయంలో తండ్రి సుబ్రమణ్యం రక్తపు మడుగులో పడి ఉన్న సందీప్‌ను గమనించాడు.
Also Read
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
స్థానికుల సహాయంతో దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సోదరుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేపట్టారు.
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!