Snake Viral video: కోపంలో కసిగా మరో పామును కాటు వేసిన భారీ పాము.. చూస్తే భయపడాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King Kobra Viral Video: సాధారణంగా చిన్నదైనా, పెద్దదైనా ఎలాంటిదైనా పామును చూస్తేనే మనం పారిపోతాం. అలాంటిదే మన ఇంట్లోనే పాములు ఎక్కడ పడితే అక్కడ ఉంటే, గోడల్లో మకాం పెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుుంది చెప్పండి. ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా. అలాగే బీహార్ లోని ఓ వ్యక్తి ఇంట్లో చాలా పాములు ఉంటున్నాయి. వాటిని ఏం చేయలేక అతను పాములను పట్టుకునే స్నేక్ సొసైటి సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి ఆ పాములను పట్టుకునే సమయంలో పాములు భయంకరంగా బుసగొడుతూ ఎంతో కోపంతో రగిలిపోయాయి. ఆవేశంలో ఓ పెద్ద పాము మరో పామును కాటు వేసింది. చూస్తుంటేనే భయంకరంగా ఒళ్లు గగుర్పొడిచే లా ఉండే ఆ వీడియో మురళీవాలే హౌస్లా అనే యూట్యూబ్ ఛానెల్లో ఉంది.
Also Read: Viral Video: భలే పిట్ట గురూ ఇది.. దొంగతనం చేసి యజమానికి ఇస్తున్న పక్షి
Also Read
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
అసలు విషయానికి వస్తే బీహార్ కు చెందిన ఓ వ్యక్తి తమ ఇంట్లోకి పాములు వచ్చాయని అక్కడ ఉండాలంటేనే భయమేస్తుందని స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించాడు. ఆ పాములను ఇంట్లో నుంచి తరిమేయాలని వేడుకున్నాడు. దీంతో స్నేక్ సొసైటీ సభ్యుడు అతని ఇంటికి వచ్చాడు. రేకుల ఇళ్లు కావడంతో ఇటుకల మధ్య సంధుల్లో పాములు ఉన్నాయి. అయితే సొసైటీ సభ్యుడు టార్చ్ లైట్ వేసి అక్కడ రెండు పెద్ద పాములు గోడ మధ్యలో ఉన్నట్లు గుర్తించాడు. దీంతో గోడను పగుల గొట్టించిన అతడు పాములను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయితే ఆ పాములు బయటకు రాకుండా మొండికేశాయి.
దీంతో ఓ పొడుగాటి కర్రలాంటి పరికరంతో వాటిని బలవంతగా లాగాడు. చూడటానికి 10 అడుగుల పైగా ఉండే రెండు పాములు అక్కడ ఉన్నాయి. వాటి లాగుతుంటే అవి కోపంతో ఎంతో కసిగా బుసలు కొట్టాయి. కోపంలో ఓ పాము ఇంకో పామును బలంగా కాటేసింది. లాగుతున్నప్పుడు కూడా ఆ రెండు పాములు విడిపోకుండా ఒకదానికి ఒకటి పెనవేసుకునే ఉన్నాయి. ఆ స్నేక్ సొసైటీ సభ్యడు వాటని పట్టుకొని ఓ సంచిలో వేసుకొని అడవిలో వదిలిపెట్టాడు. అయితే ఆ గ్రామంలో పాములు ఎక్కువగా ఉన్నాయని వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు కోరారు. దీంతో ఆయన పాములకు ఎవరి మీద కోపం, పగ ఉండదని వాటికి హాని చేస్తారనే భయంతోనే అవి కాటేస్తాయని పాములు కనిపిస్తే వాటిని చంపకుండా తమ సమాచారం అందించాలని అవగాహన కల్పించారు. ఇక పాములు పట్టుకోవడాన్ని గ్రామస్తులందరూ దగ్గరుండి గమనించారు. వాటిని తమ ఫోన్లలలో వీడియో తీసుకున్నారు. నిజంగా ఈ వీడియో చూడటానికే ఎంతో భయంకరంగా ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!