Viral Video: భలే పిట్ట గురూ ఇది.. దొంగతనం చేసి యజమానికి ఇస్తున్న పక్షి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird Stealing Money From Streets: మనం రకరకాల దొంగతనాలను చూసుంటాం. పక్కన ఉన్న షాపులో నుంచి కన్నం వేసి గోల్డ్ షాపులోకి చొరబడం, పక్కింట్లో దొంగతనం చేయడం, రాత్రుళ్లు దోపిడికి రావడం, ఈ మధ్య బ్యాంకులో దొంగతనానికి వచ్చి ఏం దొరకక గుడ్ బ్యాంక్ అని లెటర్ రాసి పెట్టి వెళ్లడం, ఇంకా దొంగతనానికి వచ్చి ఇంట్లో వండుకొని తిని వెళ్లడం లాంటి చాలానే ఫన్నీ వీడియోలు చూసుంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయే దొంగతనం వీటన్నింటికి కంటే ఫన్నీగా చూస్తేనే నవ్వు వచ్చేలా ఉంటుంది. ఇంతకీ ఆ దొంతతనం చేసింది ఏ ప్రొఫెషినల్ దొంగో, లేక అనుభవం లేక పట్టుబడిపోయిన దొంగోకాదు. ఓ పిట్ట ఈ దొంగతనం చేసింది. వింటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఇక చూస్తే షాక్ అవ్వాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను అటహరెకట్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read: Viral Video: ఇది నిజంగానే ఘోస్ట్ రైలా? ఇంజిన్ లేకుండా వెళ్లిన ట్రైన్
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ఈ వీడియోలో ఓ పిట్ట బయట వీధిలో నుంచి ఇంట్లోకి రావడం మనం చూడవచ్చు. ఆ పక్షి నల్లగా ఉంది. దానిలో నోటిలో మనం కరెన్సీ నోట్లు చూడవచ్చు. అది ఎగురుకుంటూ వచ్చి నేరుగా ఇంట్లో ఉన్న ఒక డ్రాయర్ వద్ద ఆగుతుంది. కొంచెం సేపటికి ఆ సొరుగు తెరుచుకుంటుంది. వెంటనే ఆ పిట్ట ఆ నోటును దానిలో వేస్తుంది. ఇక్కడ వింతైనా విషయం ఏంటంటే ఈ సొరుగులో చాలా కరెన్సీ నోట్లు ఉన్నాయి. అంటే ఆ పిట్ట అన్ని నోట్లను కొట్టేసి ఇంట్లో తెచ్చి పెట్టి ఉంటుంది. పిట్ట నోట్లను డ్రాయర్ లో వేస్తూ ఉండగా పెంపుడు కుక్క దాని వద్దకు వస్తుంది. అది ఎలా వేస్తుందో అని నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇలాంటి పిట్ట ఒక్కటి ఉంటే చాలు పనిచేయకుండా బతికేయొచ్చు అని కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఇదంతా ఫేక్ వీడియో అని కొట్టిపడేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ పిట్టకు ఇలా ట్రైనింగ్ ఇచ్చిన వారు చాలా గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇలా కూడా దొంగతనాలు జరిగితే మేం ఏం చేయాలి బాబు అంటూ మరికొందరు వాపోతున్నారు.
Çin’de bir adam, kuşuna sokaktan para çalıp eve getirmeyi öğretti. 😂😂 pic.twitter.com/ba1p0A2aNu
— Ataharekat 🇹🇷 (@ataharekat) August 31, 2023
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!