సాధారణంగా వర్షాకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలి.. జనావాసాల్లోకి వెళ్తుంటాయి. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇళ్లల్లోకి, బైకుల్లో, కారు ఇంజిన్‌లలో, బస్సుల్లో ఎక్కడపడితే, అక్కడ పాములు కనిపిస్తుంటాయి. వీటి వల్ల జనాలు తీవ్రంగా భయబ్రాంతులకు గురి అవుతారు. అయితే, సేమ్ ఇలాంటి ఘటన ఒకటి నిర్మల్ జిల్లాలో జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ బస్సులో నుండి వెరైటీ సౌండ్స్ రావడంతో.. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయోనని చూడగా.. అక్కడ కనిపించిన విజువల్స్ ను చూసి ప్రయాణీకులు ఒక్కసారిగా జడుసుకున్నారు. అంతే!.. బస్సు ఆపి.. భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటన నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామం దగ్గర జరిగింది. బైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసి బస్సులో ఈ నాగుపాము కనిపించింది. దీంతో ప్రయాణికులు ఆరవడంతో అప్రమత్తమైన డ్రైవర్.. నర్సాపూర్ గ్రామం దగ్గర బస్సును నిలిపివేసి పాము కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కండక్టర్ వెనుక సీట్లో పాము నక్కి ఉండటంతో జావేద్ అనే ప్రయాణికుడు ధైర్యం చేసి ఆ పామును హతమార్చాడు. అంతా మంచికే జరిగిందని.. ఒకవేళ మార్గం మద్యలో ఎవరిపైనైనా పాము దాడి చేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ నిర్మల్ చేరేంత వరకు ప్రయాణికులు మాట్లాడుకున్నారు. కాగా, ఆ బస్సులోని ఓ ప్రయాణీకుడు ఈ తతంగం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.
Read Also: Sangareddy Crime: ప్రియురాలి కోసం ఆమె భర్తను హతమార్చిన ప్రియుడు