Smriti Mandhana: మహిళల ప్రపంచ కప్ 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఒదిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి బాధ్యత నాదే అంటూ టీమిండియా మహిళల వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వహించింది. తన వికెట్ కోల్పోవడంతోనే బ్యాటింగ్ పతనం మొదలైందని, షాట్ ఎంపిక ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని ఆమె అంగీకరించింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ స్మృతి మంధాన (88) అద్భుతంగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి 125 పరుగుల కీలక భాగస్వామ్యం, ఆపై దీప్తి శర్మతో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లక్ష్యం వైపు అడుగులు వేసింది. అయితే, ఆమె లాంగాఫ్ దిశగా ఆడిన షాట్ మిస్‌టైమ్ అవ్వడంతో ఔట్ కావడం, ఆ వెంటనే రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు.
Husband Throws Wife: బ్రిడ్జి పైనుంచి భార్యను తోసేసి భర్త.. ఈ కేసులో బిగ్ ట్వీస్ట్ ఇదే!
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంధాన మాట్లాడుతూ.. ఆ సమయంలో ప్రతి ఒక్కరి షాట్ ఎంపిక మరింత మెరుగ్గా ఉండాల్సిందని.. ముఖ్యంగా ఈ పతనం నా నుంచే మొదలైంది కాబట్టి, నేను బాధ్యత తీసుకుంటానని ఆమె అన్నారు. షాట్ ఎంపిక ఇంకా బాగా ఉండాల్సింది అని పేర్కొంది. అలాగే మాకు ఓవర్‌కు కేవలం ఆరు పరుగులు మాత్రమే అవసరం. బహుశా మేము ఆటను మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉండేది. పతనం నా నుంచే మొదలైంది కాబట్టి, నేను నాపైనే బాధ్యత తీసుకుంటానని స్మృతి అంది. ముఖ్యంగా ఏరియల్ షాట్‌లు (గాల్లోకి కొట్టే షాట్లు) ఆడకూడదనే తన ప్రణాళిక నుండి భావోద్వేగాల కారణంగా తాను పక్కకు వెళ్లానని మంధాన పేర్కొంది. నేను బౌలర్‌ను టార్గెట్ చేయగలనని అనుకున్నాను. ఎక్కువగా కవర్స్ మీదుగా కొట్టాలని ప్రయత్నించాను. కానీ ఆ షాట్ మిస్‌టైమ్ అయ్యింది. బహుశా ఆ సమయంలో ఆ షాట్ అవసరం లేదు. నేను మరింత సహనంతో ఉండాల్సింది.. ఎందుకంటే ఇన్నింగ్స్ మొత్తం నేను సహనంగా ఉండాలని, గాల్లోకి షాట్లు ఆడకూడదని నాకు నేను చెప్పుకున్నాను. భావోద్వేగాలు నాపై ఆధిపత్యం చెలాయించాయి. క్రికెట్‌లో అది ఎప్పుడూ మంచిది కాదని మంధాన వివరించింది.
పొరపాటుగా ధరను పెట్టేసారా ఏంటి..? MOTOROLA Edge 60 Fusion 5G భారీ తగ్గింపు.. డోంట్ మిస్!
అలాగే మంధాన బ్యాటింగ్ యూనిట్‌ను సమర్థించింది. ఫినిషింగ్ చేయడం ఎప్పుడూ కష్టమేనని, మీరు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను చూస్తే, వాళ్ళు కూడా సరిగ్గా ముగించలేకపోయారు. చివరికి వచ్చేసరికి ఓవర్‌కు ఏడు పరుగులు చేయడం అంత తేలికైన విషయం కాదు. తొలి రెండు, మూడు మ్యాచుల్లో మేము బాగానే ఫినిష్ చేశాం. సౌత్ ఆఫ్రికాపై చివరి 10 ఓవర్లలో దాదాపు 90కి పైగా పరుగులు చేశాం. కాబట్టి మా బ్యాటర్లు చాలా మంచి పనులు చేశారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లుగా మేము ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత తీసుకుని, యువకులకు మార్గనిర్దేశం చేయాలని పేర్కొంది. అలాగే గత నాలుగు మ్యాచుల్లో ఐదుగురు బౌలర్లతో ఆడిన టీమ్ మేనేజ్‌మెంట్, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్థానంలో పేసర్ రేణుకా సింగ్‌ను తీసుకోవడంపై కూడా మంధాన మాట్లాడింది. గత రెండు మ్యాచుల్లో ముఖ్యంగా ఇండోర్ లేదా విశాఖపట్నం లాంటి ఫ్లాట్ పిచ్‌లపై ఐదుగురు బౌలింగ్ ఆప్షన్లు సరిపోవని మేము భావించాం. చాలా జట్లలో ఉండే విధంగా మాకు బౌలింగ్ చేయగలిగే బ్యాటర్లు లేరు. అందుకే, ఒక బౌలర్‌కు చెడ్డ రోజు అయితే, అది మాకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని అనుకున్నాం. జెస్సీ (జెమీమా రోడ్రిగ్స్) లాంటి వారిని తప్పించడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ కొన్నిసార్లు, బాలన్స్ చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇది శాశ్వతం కాదు.. పిచ్ ఎలా ఉంటుంది చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటాం అని ఆమె వివరించింది.