India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళా క్రికెట్ జట్టులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఇటీవల జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిపెట్టినప్పటికీ, జట్టు ప్రదర్శనపై సమీక్ష తర్వాత ఈ మార్పు అనివార్యమైంది. కెప్టెన్సీ విషయాలపై హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన మధ్య మనస్పర్థలు రావడం, డ్రెస్సింగ్ రూమ్‌లో అసౌకర్య వాతావరణం నెలకొనడం కూడా ఈ నిర్ణయానికి దారితీసినట్లు సమాచారం. మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు కూడా ముందే ఈ నాయకత్వ మార్పు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత మహిళా జట్టు నూతన కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన నియమితులయ్యారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000లకు పైగా పరుగులు సాధించిన మంధాన నాయకత్వంలో భారత్ సరికొత్త ప్రయాణానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వేతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం బీసీసీఐ టీం సభ్యులను ప్రకటించింది. షఫాలీ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రాయ్‌పూర్ వేదికగా అక్టోబర్ 16 నుంచి 20 వరకు టీ20 సిరీస్ జరగనుండగా.. వడోదర వేదికగా అక్టోబర్ 23 నుంచి 28 వరకు వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్లు..
టీ20 జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, నికి ప్రసాద్, హర్మన్‌ప్రీత్ కౌర్, అనుష్క శర్మ, రిచా ఘోష్, జి. కమలిని, దీప్తి శర్మ, ప్రేమ్ రావత్, శ్రీ చరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, జింటిమణి కమిత, మిన్ను మణి.
వన్డే జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్, యస్తిక భాటియా, వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సాయాలి సత్ఘారే, రేణుకా ఠాకూర్.
కొత్త నాయకత్వ పగ్గాలు చేపట్టిన స్మృతి మంధాన రాబోయే జింబాబ్వే సిరీస్‌తో తన కెప్టెన్సీ శకానికి అడుగులు వేయనున్నారు. జట్టులో కుదురుకున్న ఈ నూతన నాయకత్వం భవిష్యత్తులో భారత్‌ను మరిన్ని విజయాల వైపు నడిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!