ఎలెక్ట్రానిక్ వస్తువులు ఏదైనా కొత్తలో బాగా పని చేస్తుంది.. రాను రాను వాడే కొద్ది దాని పెర్ఫార్మన్స్ స్లో అవుతుంది.. ముఖ్యంగా ఫోన్ల గురించి చూస్తే.. మనం వాడినా, వాడాకున్నా చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఇది చిరాగ్గా అనిపిస్తుంది.. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అవ్వడం పెద్ద సమస్యగా అందరూ భావిస్తూ ఉంటారు. ఫోన్ వాడినా వాడకపోయినా అది ఆన్‌లో లేకపోతే మనశ్శాంతి ఉండదు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొన్ని టిప్స్ పాటించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
బ్యాటరీ సమస్యల గురించి కచ్చితంగా తెలియనప్పుడు, మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం ఉత్తమం. మీ పరికరం పునఃప్రారంభమయ్యే వరకు దాదాపు 30 సెకన్ల పాటు పవర్ బటన్‌ను పట్టుకోవాలి.. ఇలాంటి రిస్టార్ట్ చెయ్యడం వల్ల రన్ అయిన అప్లికేషన్ ను రిఫ్రెష్ చేస్తుంది.. అలాగే కొత్తగా స్టార్ట్ అవుతుంది..
కొన్నిసార్లు బ్యాటరీ సమస్యలు అనేది ఫోన్‌కు సంబంధించినవైనవి ఉండవు. మనం వాడే యాప్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కూడా బ్యాటరీ పెర్ఫార్మెన్స్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మనం స్మార్ట్ ఫోన్‌లో వాడే యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి.. ఇలా చెయ్యడం వల్ల యాప్ పనితీరు స్పీడు అవుతుంది.. దాంతో బ్యాటరీ తీరు కూడా పెరుగుతుంది..
మీ ఫోన్ బ్యాటరీను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడానికి ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయవచ్చు. అయితే దీనికి ముందు మీ ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయాలి. బ్యాకప్ చేశాక మీ ఫోన్ సెట్టింగ్‌ల ద్వారా ఫోన్‌ను రీసెట్ చేయవచ్చు.. అలాగే కొత్త సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేసుకోవాలి.. అప్పుడే ఫోన్ ఫాస్ట్ అవుతుంది.. బ్యాటరీ సామర్థ్యం కూడా పెరుగుతుంది.. ఈ టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా బ్యాటర్ చార్జింగ్ బాగుంటుంది..