కడుపు నిండా తిండి లేకున్నా మనుషులు బ్రతుకుతారేమో గానీ, కంటినిండా నిద్ర లేకుంటే మాత్రం ఎక్కువ రోజులు బ్రతకరని అందరికీ తెలుసు.. సాధారణంగా ఒక రోజు సరిగ్గా నిద్ర లేక పోతేనే తల నొప్పి, కళ్లు తిరగడం, వికారంగా, నీరసంగా ఉంటుంది.. అలా కంటిన్యూగా నిద్ర సరిగ్గా పోకపోతే మాత్రం ఆ మనిషి ఎక్కువగా కాలం బ్రతకడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడాలంటే నిద్ర అవసరం. రోజంతా చేసిన శ్రమ, ఒత్తిడి, శరీరం రీయాక్టీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా నిద్ర పోవాల్సిందే.. 7లేదా 8 గంటల పాటు సరైన నిద్ర ఉండాలి.. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా నిద్రపోతారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
సాదారణంగా కంటిన్యూగా వర్క్ చేసేటప్పుడు శరీరానికి, మనసుకు రెస్ట్ అవసరం. ఇలాంటప్పుడు కొంచెం సేపు కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వాలి. అయితే అది నిద్రకు సమానం కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు.. శరీర అవయవాల పని తీరు వేరు వేరుగా ఉంటుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకోవడం కంటే నిద్రపోయినప్పుడు మన మెదడు మరింత రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు..
ఒక్కొక్కరికి ఒక్కోలా పడుకుంటే నిద్ర పడుతుంది..కొంత మందికి బెడ్ లైట్ ఉంటేనే నిద్ర పడుతుంది. బెడ్ లైట్ లో పడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకుంటారు. కానీ వెలుతురులో పడుకోవడం వల్ల పదే పదే మెలకువ అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్లీ నిద్ర పట్టక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా టీవీ వెలుతురులో, లైట్ వెలుతురులో నిద్ర పోయే లేడీస్ క్రమంగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. సో వీలైనంత వరకు వెలుతురు లేకుండా పడుకోవడానికి ప్రయత్నించడం మేలు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.