Site icon NTV Telugu

Shocking: ప్రేమ, పెళ్లి, ద్రోహం.. సెప్టిక్ ట్యాంక్‌లో పుర్రె.. 6 నెలల తర్వాత తెలిసిన నిజం..

Crime

Crime

Shocking: ఆరు నెలల క్రితం మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. చివరకు పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ప్రారంభమైన లవ్ స్టోరీ, చివరకు ద్రోహం, వ్యసనం, హత్యగా మారింది. మధ్యప్రదేశ్‌లోని డియోరి నగరంలో తప్పిపోయిన 22 వ్యక్తి కేసులో భయంకరమైన నిజాలు తెలిశాయి. నిందితుడి ఇంటి వెనక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో మృతుడి పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సాగర్ జిల్లాకు చెందిన ప్రిన్స్ వాల్మికి ఆగస్టు 20 నుంచి కనిపించకుండా పోయాడు. అతడి భార్య తులసి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడం పోలీసులు దర్యాప్తును నిలిపేశారు. అయితే, ప్రిన్స్ అదృశ్యంపై కుటుంబ సభ్యులకు అనుమానం రావడం, పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో విచారణ మలుపు తిరిగింది. సాంకేతిక నిఘా, మొబైల్ ట్రాకింగ్ పోలీసులను నిందితుడు షోయబ్ ఇంటికి తీసుకెళ్లాయి. నర్సింగ్‌పూర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: SL vs OMAN: పసికూనను గడగడలాడించిన శ్రీలంక.. ఓమాన్‌పై 105 పరుగుల ఘన విజయం!

విచారణలో ప్రేమ వ్యవహారం కారణంగా ప్రిన్స్‌కు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకునన్నాడు. ప్రిన్స్‌తో తులసికి వివాహం కాకముందే షోయబ్‌తో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వివాహం తర్వాత కూడా తులసి, షోయబ్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. పెళ్లయిన నెలలోనే తులసి ప్రవర్తన మారిందని, ఇంట్లో తరుచుగా వివాదాలు ప్రారంభమయ్యాయని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు.

షోయబ్, ప్రిన్స్‌తో స్నేహాన్ని పెంచుకుని, అతడి మద్యానికి బానిస చేసినట్లు విచారణలో తేలింది. షోయబ్, తులసిలు రహస్యం కలవడాన్ని గుర్తించిన ప్రిన్స్ అభ్యంతరం తెలుపడంతో ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఆగస్టు 20న ప్రిన్స్‌కు మత్తుమందు ఇచ్చి హత్య చేసి, అనుమానం రాకుండా అతడి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్లు తేలింది. ఆధారాలు తుడిచిపెట్టడానికి నిందితుడు మృతదేహం వేగంగా కుళ్లిపోయేలా చేసేందుకు ఉప్పు చల్లినట్లు తెలిసింది. ప్రిన్స్ ఎముకలను డీఎన్ఏ టెస్ట్ కోసం పంపించారు. హత్య తర్వాత షోయబ్ తులసితో కలిసి గుజరాత్ పారిపోయారని, ఇద్దరూ కలిసి నివసిస్తున్నట్లు తేలింది.

Exit mobile version