ఢిల్లీ లో ఏకంగా ఆరుగురు ఉగ్ర వాదులు పట్టు బడ్డారు. ఈ ఆరుగురు ఉగ్ర వాదులను ఢిల్లీ కి చెందిన పోలీసులు పట్టుకున్నారు. ఒకే సారి పలు రాష్ట్రాల లో ఢిల్లీ పోలీసులు సోదాలు, తనిఖీలు చేశారు. ఈ నేపథ్యం లోనే… ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ప్రయాగ్ రాజ్, ఢిల్లీ లో అనుమానితులైన ఆరుగురు ఉగ్ర వాదులు అరెస్టు అయ్యారు.
ఇక ఈ అరెస్టు అయిన ఆరుగురు అనుమానిత ఉగ్ర వాదుల లో ఇద్దరు పాకిస్థాన్ లో శిక్షణ పొందినట్లు సమాచారం అందుతోంది. పాక్ లో శిక్షణ పొందిన ఉగ్ర వాదులను ఒసామా, జీషన్ లు గా గుర్తించారు ఢిల్లీ “స్పెషల్ సెల్” పోలీసులు. అంతే గాకుండా, తనిఖీల సందర్భంగా పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ “స్పెషల్ సెల్” పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ “స్పెషల్ సెల్” డి.సి.పి ప్రమోద్ కుష్వా వెల్లడించారు. ఇక ఘటన పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.