Site icon NTV Telugu

Sivakarthikeyan Seyon: రాజ్‌కమల్ ఫిల్మ్స్ నుంచి మరో సెన్సేషన్.. శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే!

Sivakarthikeyan Seyon

Sivakarthikeyan Seyon

Sivakarthikeyan Seyon: తమిళ ప్రేక్షకుల మనసుల్లో స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్న నటుడు శివకార్తికేయన్. ఆయన తాజా తన 26వ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ ప్రకటించాడు. ఇంతకీ శివకార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా.. ‘సెయోన్'(Seyon). ఈ చిత్రాన్ని భక్తి, ఫాంటసీ, రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మాస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అమరన్’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే.

READ ALSO: Bhatti Vikramarka : ప్రజల నమ్మకమే గెలిచింది.. మధిరను మోడల్ సిటీగా మారుస్తాం..

తాజా మళ్లీ వీరి కాంబోలో మరొక సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వీరం ఉండు వెట్రి ఉండు’ అనే తాగ్‌లైన్‌తో రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లలో శివకార్తికేయన్ రఫ్ అండ్ టఫ్ లుక్‌లో, మయూరం (పీకాక్) ఆభరణాలు, సాంప్రదాయ ఆయుధంతో వీరుడిలా కనిపిస్తున్నాడు. ఈ లుక్ భక్తిని, మాస్ ఎనర్జీని ఒకేసారి చూపిస్తుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. రేపు ఉదయం (ఫిబ్రవరి 17 ఉదయం 10 గంటలకు) నిర్వహించనున్న స్పెషల్ ఈవెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డే్ట్స్ తెలిసే ఛాన్స్ ఉంది.

READ ALSO: Mahesh Babu: బాబు కాల్ షీట్స్ కోసం నిర్మాతల క్యూ.. వారణాసి తర్వాత లక్కీ ఛాన్స్‌ ఎవరికంటే!

Exit mobile version