మొయినాబాద్ ఫాంహౌస్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన ఇటీవలే సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఈ మేరకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు కమాండ్ కంట్రోల్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు.
Also Read : HIV Positive: ఆ జైలులో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్.. 35 మందికి టీబీ..
ఇప్పటికే ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సిట్ నోటీసులపై హైకోర్టులో బీజేపీ తరుఫున ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులను ప్రస్తావించిన బీజేపీ.. బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌ల నోటీసులపై స్టే ఇవ్వాలని ప్రేమేందర్ రెడ్డి కోరారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని సిట్ వేధిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.