ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు… రేపు బీజేపీ కీలక నేతల స్టేట్‌మెంట్ తీసుకోనున్నారు. ఎంపీలు ఈటెల, ధర్మపురి, రఘునందన్ రావులకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఈ ముగ్గురి ఫోన్లతోపాటు… వీళ్ల అనుచరులు, కుటుంబ సభ్యులు, ఎన్నికల సమయంలో వీరికి ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ గురైనట్లు ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు స్వరూపమే మారేలా కనిపిస్తోంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియా రావడం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవడంతో ట్యాపింగ్ కేసు స్పీడప్ అందుకుంది. ప్రభాకర్ రావును రెండుసార్లు విచారించిన సిట్…. ప్రణీత్ రావును మరోసారి విచారించింది. అనూహ్యంగా బాధితులను నేరుగా సిట్ ఆఫీస్‌కు పిలిపించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు.
READ MORE: Best Battery Smartphones: బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్ ఇవే..!
ఈరోజు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ అధికారుల ముందుకు వచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్… తన నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. సిట్ కార్యాలయం నుంచి బీజేపీ కాలక నేతలకు కూడా పిలుపు అందింది. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు రేపు సిట్ ఆఫీస్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. ఈ ముగ్గురి వ్యక్తిగత ఫోన్లతోపాటు… వారి కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు గుర్తించింది సిట్. ముఖ్యంగా సాధారణ ఎన్నికల సమయంలో… అంటే… 2023 నవంబర్ 15 నుంచి ట్యాపింగ్ చేసినట్లు అధారాలు సేకరించారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఈ ముగ్గురికీ ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ గురైనట్లు గుర్తించారు సిట్ అధికారులు.
రివ్యూ కమిటీని తప్పుదోవ పట్టించి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించింది సిట్. ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్న రాజకీయ నేతలు, వాళ్ల కుటుంబ సభ్యలు, అనుచరుల ఫోన్ నెంబర్లను… మావోయిస్టుల సానుభూతిపరుల నెంబర్లుగా పేర్కొంటూ రివ్యూ కమిటీకి నివేదిక అందించినట్లు ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. సాధారణ ఎన్నికల సమయంలో మావోలు యాక్టివ్ అయ్యారని.. వాళ్ల నెంబర్లను ట్యాపింగ్ చేయాలని రివ్యూ కమిటీకి సూచించి తప్పుదోవ పట్టించారు. రేపు ఈ ముగ్గురు నేతల స్టేట్‌మెంట్ రికార్డు చేస్తే.. ఫోన్ ట్యాపింగ్ కేసు స్వరూపమే మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు. కానీ… సిట్ ప్రస్తుతం పక్కా ఆధారాలతో సిద్ధంగా ఉంది. వీటికి బాధితుల స్టేట్‌మెంట్ కూడా తోడవనుంది. విచారణ కూడా మరింత వేగవంతం అవనుంది.
READ MORE: CM Revanth Reddy: ఏపీ సీఎం చంద్రబాబుకు టీజీ సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచన..!
మరోవైపు… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి.. వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనట్లు తెలుయస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడుతోంది… అనే విషయాలపై నిఘా పెట్టినట్లు సిట్ గుర్తించింది. షర్మిల మాట్లాడే నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు అధికారులు. తన ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నట్లు అనుమానం ఉందని పలుమార్లు ప్రస్తావించారు షర్మిల. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. వీలైతే… సిట్ నుంచి షర్మిల కు కూడా పిలుపు వచ్చే అవకాశం లేకపోలేదు. విచారణలో ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా ప్రభాకర్ రావు పేరు చెప్తుండగా… ప్రభాకర్ రావు మాత్రం తనకేం తెలియదని అంటున్నారు. దీంతో.. ఇప్పటివరకు విడివిడిగా విచారించిన సిట్… నిందుతులందరినీ కంబైన్డ్‌గా విచారించే అవకాశం కూడా లేకపోలేదు.