Veldi Hariprasad : వెల్డీ హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూలు పోగులతో అపురూప “కళ” చిత్రం. సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసిన “జీ 20” ప్రత్యేక చిత్రం. ప్రధాని మోడీ తోపాటు ప్రతినిధుల చిత్రాలు చేతిమగ్గంపై ఆవిష్కరణ. చేతిమగ్గంపై నూలు పోగులతో అద్భుతాలను ఆవిష్కరించే చేనేత కళాకారుడు వెల్డీ హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ చేశారు. భారతదేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను పురస్కరించుకొని అపురూపమైన కళారూపాన్ని వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై నేసి సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను మరోసారి జాతీయస్థాయిలో నిలబెట్టునున్నారు. సిరిసిల్ల చేనేత కళ కు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చి దేశ ప్రధాని మోడీతో శభాష్ అనిపించుకున్న కళాకారుడు వెల్ది హరిప్రసాద్. మన్‌కీ బాత్ కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోడీ వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.
Also Read : Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..
Also Read
ఇటీవలే సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేలా “సిరిసిల్ల సిరిపట్టు” చీరను వెల్ది హరిప్రసాద్ దంపతులు చేతిమగ్గంపై రూపొందించి గవర్నర్ తమిళ్ సై చేత ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం దేశంలో జరగనున్న జి20 సమావేశాల సందర్భంగా వెల్ది హరిప్రసాద్ చేతిమగ్గంపై భారతదేశ చిత్రపటంతో పాటు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోడీ చిత్రాన్ని 20 దేశాల ప్రతినిధుల చిత్రాలు వచ్చేలా నూనె పోగులతో అపురూప కళా చిత్రాన్ని ఆవిష్కరించారు.
Also Read : Meera Chopra : అందుకే పవన్ కల్యాణ్ రియల్ హీరో అయ్యారు..
జీ 20 లోగో జరి అంచుతో రూపొందించిన హరి ప్రసాద్ కళ చిత్రం మరోసారి జాతీయస్థాయిలో సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను చాటేలా చేతిమగ్గంపై ఆవిష్కరించారు. జి20 లోగోను గతంలో చేతిమగ్గంపై నేసిన హరిప్రసాద్ ఈసారి ప్రత్యేకంగా మన దేశంలో జరుగుతున్న జీ20 సమావేశాలను దృష్టిలో ఉంచుకొని చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. వారం రోజులపాటు కష్టపడి చేతిమగ్గంపై రెండు మీటర్ల వస్త్రంపై నూలు పోగుల మధ్య ఆవిష్కృతమైన కళా నైపుణ్యాన్ని చూసి అబ్బుర పడాల్సిందే. తగిన ప్రోత్సాహం అందిస్తే ఇలాంటి మరెన్నో కళారూపాలను ఆవిష్కరిస్తానని వెల్ది హరిప్రసాద్ తెలిపారు..
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!