Site icon NTV Telugu

Singireddy Niranjan Reddy : ప్రజాక్షేత్రంలో ప్రజల మనస్సు గెలవాలి, మన్నన పొందాలి

Niranjan Reddy

Niranjan Reddy

కరోనా పరిస్థితుల్లో రుణ మాఫీ అమలు చేయలేకపోయామని, అయినా వడ్డీతో సహా రుణ మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఉన్నారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. తాజాగా ఆయన ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మొన్న మా సోదరుడు పొంగులేటి ఏదేదో మాట్లాడుతున్నరంట.. కరెంటు ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంతకంటే ఘనంగా తెలంగాణలో ఎవరు మంచిగా చేస్తారో, దమ్మున్న వారూ ముందుకు రండి అని ఆయన సవాల్‌ చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మనస్సు గెలవాలని, మన్నన పొందాలన్నారు. కేవలం ప్రభుత్వాన్ని, ప్రజల పాలకులను తిడితే అధికారం రాదని గ్రహించండని నిరంజన్‌ రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో ఏర్పడ్డ లక్ష్యాలు అమలు చేయడం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనడం విడ్డూరంగా ఉందని నిరంజన్‌ రెడ్డి విమర్శించారు.

Also Read : Budget 2023: రైల్వే శాఖకు బడ్జెట్‌ బూస్ట్‌.. రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు

రాజకీయాలకోసం మాట్లాడవద్దని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు నిరంజన్‌ రెడ్డి. బీజేపీ వారికి కేసీఆర్‌నీ తిట్టడం తప్ప మరేది చాత కాదన్నారు నిరంజన్‌ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని ఆయన మండిపడ్డారు. దక్షిణాది ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏంటని ఆయన ప్రశ్నించారు.

Also Read : Tammineni Sitaram: సీఎం ఎక్కడినుండి పాలిస్తే అదే రాజధాని

Exit mobile version