1 KG Silver Rate Crosses 1 Lakh in Hyderabad: గత కొద్ది నెలలుగా బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతూ పోతున్నాయి. ధరల పెరుగుదలో బంగారం, వెండి.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ ఆల్‌టైమ్ హైకి చేరుకోగా.. కిలో వెండి ఏకంగా లక్ష దాటేసింది. ఏడాది క్రితం కిలో వెండి ధర రూ.50 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.1,00,000 దాటింది. దాంతో వెండి కూడా బంగారమైంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే భయపడే జనాలు.. ఇప్పుడు వెండి అన్నా కూడా బెంబేలెత్తిపోతున్నారు.
హైదారాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు (జులై 17) రూ.1,00,500గా ఉంది. ఈరోజు కిలో వెండిపై రూ.1000 పెరిగింది. మూడు రోజుల క్రితం రూ.95,500గా ఉన్న కిలో వెండి ధర.. ఈరోజు లక్ష దాటేసింది. ఈ మూడు రోజుల్లో కిలో వెండి ధర రూ.5 వేలు పెరిగింది. గతంలో లక్ష వరకు వచ్చిన వెండి.. ఇటీవలి రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ షాక్ ఇస్తూ లక్ష దాటింది. పెరుగుతున్న ధరలు చూసి.. కొనుగోలుదారులు షాపుల వైపు చూడడం కూడా మానేశారు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి బుధవారం రూ.96,000గా నమోదైంది.
Also Read: Gautam Gambhir Farewell Note: నేను ప్రతిరోజు ఓడిపోతాను కానీ.. గౌతమ్ గంభీర్ ఎమోషనల్ వీడియో!
ఈరోజు బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.900.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980 పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,750గా.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,000గా ఉంది. హైదారాబాద్ మార్కెట్‌లో ఇవే పసిడి ధరలు కొనసాగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో పెరుగుతున్న బంగారం ధరలను చూస్తుంటే.. త్వరలోనే తులం లక్షకు చేరుతుందనిపిస్తుంది.