కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది. తాజాగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లో ఖాళీ పోస్టులకు దరఖాస్తులను కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 50 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లను భర్తీ చేయనుంది.. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 28. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sidbi.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి కనీస విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించి ఉండకూడదు..
ఎంపిక ప్రక్రియ..
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ రెండు విభాగాల్లో సాధించిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది..
అప్లికేషన్ ఫీజు..
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు రూ. 1100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఈ ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 175 చెల్లించాలి..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
*. సిడ్బీ అధికారిక వెబ్‌సైట్ www.sidbi.in ను సందర్శించండి.
*. హోమ్‌పేజీలో, కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
అక్కడ కనిపిస్తున్న జాబ్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి.
*. అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
*. ఆ దరఖాస్తు ఫామ్‌ను పూరించండి.
*. దరఖాస్తు రుసుము చెల్లించండి.
*.అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
*.ఫామ్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింట్ తీసుకోండి..