Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కేవలం 51 బంతుల్లో 74 పరుగులు చేసిన విరాట్.. వర్షం కారణంగా కుదించిన 167 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలోనే ఛేదించేలా చేశాడు. మధ్యలో మిడిలార్డర్ వికెట్లు పడి కాస్త కంగారు పెట్టినా, టీమిండియా ఒత్తిడిని జయించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
ఇక, మ్యాచ్ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై ఫుల్ ఖుషీ అయ్యాడు. బౌలింగ్, ఫీల్డింగ్ రెండింట్లోనూ టీమ్ చాలా బాగా ఆడిందని గిల్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన రన్ అవుట్ (Run out) మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని, అక్కడే గేమ్ మూమెంట్ మొత్తం తమ వైపు తిరిగిందని అన్నాడు. మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ జోడీ(Partnership) గతంలో ఇండియాలోనూ బాగా ఆడిందని, ఇక్కడ కూడా వాళ్ల పార్ట్నర్షిప్ కాస్త టెన్షన్ పెట్టిందని తెలిపాడు. యువ పేసర్లు అన్షుల్ కంబోజ్(Anshul Kamboj), గుర్నూర్ బ్రార్(Gurnoor Brar)ల బౌలింగ్ గురించే గిల్ ప్రత్యేకంగా మాట్లాడాడు. అన్షుల్ లాంటి బౌలర్లు ఈ కండిషన్స్‌కి పర్ఫెక్ట్ అని, సీమ్ చేయడంలో, (Old ball)పాత బంతితో రాణించడంలో అతను బెస్ట్ అని మెచ్చుకున్నాడు.
Also Read
- AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా, పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!
- WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
- Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
- Itlu Arjuna : ఎన్టీఆర్‌ను ఫిదా చేసిన కొత్త హీరో: 'ఇట్లు అర్జున' ట్రైలర్ సంచలనం!
పిచ్ నుంచి ఎలాంటి హెల్ప్ లేనప్పుడు గుర్నూర్ బ్రార్ తన పేస్, ఎక్స్ట్రా బౌన్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడని చెప్పాడు. రాత్రి వేళ వీరిద్దరి బౌలింగ్ స్పెల్స్ (Spells) చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశాడు. వర్షం అంతరాయం, పిచ్ కండిషన్స్ గురించి చెప్తూ.. ఆల్రెడీ సెట్ అయ్యాక వర్షం పడితే మళ్లీ ఇబ్బందిగా ఉంటుందని, వర్షం తర్వాత పిచ్ మరింత స్పీడ్‌గా, నిప్పీగా మారిందని గిల్ వివరించాడు. టార్గెట్ చిన్నది కావడంతో తాము ఎక్కువ టెన్షన్ పడకుండా నార్మల్ ఆడటానికే మొగ్గు చూపామని చెప్పాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన తీరుతో ఛేజింగ్ చాలా ఈజీ అయిపోయిందని ప్రశంసించాడు. ఇక రాబోయే వెల్లింగ్టన్ మ్యాచ్‌కి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఇదే కన్సిస్టెన్సీని రిపీట్ చేస్తే విజయం మనదేనని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా, పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!
-
Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..