Site icon NTV Telugu

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన భారత్.. అగ్రస్థానంలో గిల్, సిరాజ్

Icc Rankings

Icc Rankings

ICC Rankings: వన్డే వరల్డ్ కప్‌ 2023లో దూసుకెళ్తున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన సత్తాను చాటుకుంది. వన్డేల్లో నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను వెనక్కినెట్టి వన్డే ల్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్‌గా శుభ్ మన్ గిల్ నిలిచాడు. సచిన్, ధోనీ, కోహ్లీ తర్వాత వరల్డ్ నెం.1 బ్యాటర్ గా నిలిచిన నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా గిల్ ఆ ఘనతను సాధించాడు. భారత బ్యాటర్లలో 4వ స్థానంలో కోహ్లీ ఉండగా.. 6వ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన చిన్న వయస్కుడిగా గిల్ రికార్డు సృష్టించాడు. ఈ విషయంలో సచిన్ రికార్డును శుభ్‌మన్ గిల్ బ్రేక్ చేశాడు.

Also Read: Amitabh Bachchan: అల్లు అర్జున్ పై అమితాబ్ ప్రశంసలు.. వీడియో వైరల్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెం.1 బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ నిలిచాడు. 4వ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కి కుల్దీప్ చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో బుమ్రా నిలిచాడు. ఏడు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకులో షమీ ఉన్నాడు. ఆల్ రౌండ్ విభాగంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో 10వ స్థానంలో రవీంద్ర జడేజా ఉన్నాడు.

Exit mobile version