NTV Telugu Site icon

Shubhman Gill: 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా యువ ఓపెనర్

Gill

Gill

Shubhman Gill: టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ వరల్డ్ కప్లో మంచి ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గిల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు శుభ్మాన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డుల్లోకెక్కాడు. గిల్ కేవలం 38 ఇన్నింగ్స్ లలోనే 2 వేల పరుగులు సాధించాడు.

Read Also: Benjamin Netanyahu: హిజ్బుల్లా యుద్ధానికి దిగితే.. ఇజ్రాయిల్ ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్..

గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. అతను 40 ఇన్నింగ్స్ లలో 2,000 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇటీవలే గిల్… అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ గా శిఖర్ ధావన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

Read Also: Fake ED Commissioner: తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను అరెస్టు..

వన్డేల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో పాకిస్థాన్ మాజీ లెజెండ్ జహీర్ అబ్బాస్, ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్, ప్రస్తుత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, దక్షిణాఫ్రికా ప్రస్తుత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాస్సీ వాన్ డెర్ డుసెన్ ఉన్నారు. ఈ బ్యాట్స్‌మెన్‌లందరూ వన్డేల్లో 2000 పరుగులు చేయడానికి 45 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. అయితే గిల్ అందరినీ పక్కన నెట్టి ఈ రికార్డును నమోదు చేశాడు.

Show comments