Shruti Haasan Joins Dacoit Movie Shooting: అడివి శేష్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘డకాయిట్’. పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా డకాయిట్ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ బయటికొచ్చింది.
తాజాగా శ్రుతి హాసన్ డకాయిట్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ యాక్షన్ షెడ్యూల్‌కు సంబంధించి సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు, ప్రధాన తారాగణంతో కూడిన యాక్షన్ పార్ట్‌ను తీయనున్నారు. తాను డకాయిట్ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు అడివి శేష్‌తో దిగిన సెల్ఫీని శ్రుతి హాసన్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
Also Read: WI vs NZ: టీ20 ప్రపంచకప్ సూపర్ 8కు వెస్టిండీస్.. న్యూజిలాండ్ ఇంటికి!
ఇద్దరు మాజీ ప్రేమికుల నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ స్టోరీగా డకాయిట్ రూపొందుతోంది. క్షణం, గూడాచారి సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేసిన షానీల్ డియో.. డకాయిట్ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షానీల్ డియో పాటు అడివి శేష్ ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. శేష్, శ్రుతి జంటగా నటించిన తొలి చిత్రం ఇది. 2022లో మేజర్ సినిమాతో శేష్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత శేష్ నటిస్తున్న రెండవ హిందీ చిత్రం ఇదే.