Today India Olypics 2024 Schedule: భారీ ఆశలతో పారిస్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవుతోంది. ఈ ఎడిషన్‌లో అయినా డబుల్ డిజిట్ అందుకుందామనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. పతకాలు ఆశించిన ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్‌లో మన క్రీడాకారులు దారుణంగా విఫలమవ్వగా.. షూటింగ్‌లో మను భాకర్ పుణ్యమా అని మూడు పతకాలు వచ్చాయి. హాకీలో ఇంకా పతకం ఖాయం కాకున్నా.. మనోళ్ల జోరు చూస్తే కచ్చితంగా మెడల్‌తోనే తిరిగొస్తారన్న నమ్మకం ఉంది.
భారత్ రెండంకెల పతకాల లక్ష్యాన్ని సాధించాలంటే రెజ్లర్లు ఓ పట్టు పట్టాల్సిందే. పారిస్ ఒలింపిక్స్‌లో సోమవారం నుంచే రెజ్లింగ్ పోటీలు ఆరంభం కాబోతున్నాయి. తొలి రోజు నిషా దహియా, వినేశ్ పొగాట్, అంతిమ్ పంగల్ వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగబోతున్నారు. సోవాతో నిషా తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30కు మొదలవుతుంది. టేబుల్ టెన్నిస్, సెయిలింగ్, అథ్లెటిక్స్ విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు.
భారత క్రీడాంశాలు ఇవే:
టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ ప్రిక్వార్టర్స్ (భారత్ × రొమేనియా)- మధ్యాహ్నం 1.30
అథ్లెటిక్స్: మహిళల 400మీ పరుగు తొలి రౌండ్ (కిరణ్ పహాల్)- మధ్యాహ్నం 3.25,
పురుషుల 3000మీ స్టీపుల్‌ఛేజ్ తొలి రౌండ్ (అవినాశ్ సాబ్లె)- రాత్రి 10.34
సెయిలింగ్: డింగీ రేసు మహిళలు (నేత్ర)- మధ్యాహ్నం 3.45,
పురుషులు (విష్ణు)- సాయంత్రం 6.10
రెజ్లింగ్: మహిళల 68 కేజీల ప్రిక్వార్టర్స్ (నిశా × సోవా)- సాయంత్రం 6.30
షూటింగ్: స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (మహేశ్వరి-అనంత్)- మధ్యాహ్నం 12.30
పతక రౌండ్లు: బ్యాడ్మింటన్: సింగిల్స్ కాంస్య పోరు (లక్ష్యసేన్ × జియా లీ)- సాయంత్రం 6