Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య వార్ నేపధ్యంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం, భయానక పరిస్థితులు భారతీయ సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రాలు ‘వారణాసి‘ మరియు ‘రాకా‘ తమ విదేశీ షూటింగ్ షెడ్యూళ్లను అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర బృందాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి‘. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను దుబాయ్ లో చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా ఆ ప్లాన్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీనికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోనే భారీ సెట్లు వేసి చిత్రీకరణ జరపాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్లోబల్ ట్రిప్ ప్లాన్ చేసిన ఈ మూవీ టీమ్ పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూడాలని భావిస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రాకా‘ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లను మిడిల్ ఈస్ట్ ఎడారులలో చిత్రీకరించాల్సి ఉంది. కానీ అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఇతర లోకేషన్ల కోసం వెతుకుతోంది లేదా ముంబైలోని స్టూడియోలలో సెట్టింగ్స్ వేసి షూట్ పూర్తి చేయాలని ఆలోచిస్తోంది. ఈ అకస్మాత్తు మార్పుల వల్ల సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరగడమే కాకుండా విడుదల తేదీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
Also Read
- SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్‌ను..!
- FIFA World Cup: సెనెగల్పై 'కిలియన్ ఎంబాపే' డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
- Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
- Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
తాజావార్తలు
-
Microsoft Surface Pro: OLED డిస్‌ప్లే, 16GB RAM, ప్రీమియం ఫీచర్లతో.. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ల్యాప్‌టాప్ విడుదల
-
SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్‌ను..!
-
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
-
Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్‌ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!