Vivo X200 FE vs OnePlus 13s: భారత మార్కెట్లో ఎప్పటికప్పుడు వివో, వన్‌ప్లస్ బ్రాండ్లు తమ లేటెస్ట్ ప్రీమియం ఫోన్లతో పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కంపెనీల నుండి తాజాగా vivo X200 FE, OnePlus 13s రెండూ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో, అద్భుతమైన పనితీరుతో మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ రెండు మధ్య ఏది బెస్ట్ ఎంపిక..? వీటిలో ఏది కొనుగోలు చేయాలో ఒకసారి చూద్దామా..
డిస్ప్లే:
vivo X200 FE లో 6.31 అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్ ఉండగా, OnePlus 13s లో 6.32 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కానీ vivo ఫోన్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇవ్వగా, OnePlus ఫోన్ Dolby Vision సపోర్టుతో వస్తుంది. రెండు స్క్రీన్లలో తేడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ బ్రైట్నెస్ పరంగా వివో బెస్ట్ అని చెప్పవచ్చు.

ప్రాసెసర్ అండ్ పనితీరు:
vivo X200 FE Dimensity 9300+ చిప్‌సెట్‌ను ఉపయోగిస్తే, OnePlus 13s స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. రెండూ 4nm ఫాబ్రికేషన్ టెక్నాలజీతో రూపొందించబడ్డవి. అయితే వీటిలో గేమింగ్ ప్రాసెసింగ్ పరంగా స్నాప్ డ్రాగన్ 8 Elite కాస్త మెరుగైన ప్రదర్శన కలిగి ఉంది.
ర్యామ్ అండ్ స్టోరేజ్:
ఈ రెండు ఫోన్లలోనూ 12GB లేదా 16GB LPDDR5X RAM, అలాగే 256GB లేదా 512GB UFS 4.0 స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. పనితీరు పరంగా పెద్ద తేడా ఏమి ఉండదు.

కెమెరా సెటప్:
vivo X200 FE లో ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP (Sony IMX921) ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో (IMX882), 50MP సెల్ఫీ కెమెరా ఉంది. కానీ, OnePlus 13s లో కేవలం 50MP ప్రైమరీ (Sony LYT-700), 50MP 2x టెలిఫోటో మాత్రమే ఉన్నాయి. అల్ట్రా వైడ్ లేదు. ఫ్రంట్ కెమెరా 32MP మాత్రమే. కాబట్టి ఫోటోగ్రఫీ ప్రియులకు అయితే మాత్రం వివో క్లియర్ విన్నర్.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్:
vivo X200 FE లో 6500mAh బ్యాటరీ ఉంది. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందిస్తుంది. మరోవైపు OnePlus 13s లో 5850mAh బ్యాటరీ మాత్రమే ఉంది. ఇది 80W ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్ పరంగా కూడా వివో బెస్ట్ గా ఉంది.

ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్డేట్స్:
రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 15 ఉంది. కానీ OnePlus 13s 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ హామీ ఇస్తోంది. వివోలో కూడా దీన్ని సరిపోయే స్థాయిలో అందించే అవకాశం ఉంది కానీ స్పష్టత లేదు.
ఇతర ఫీచర్లు:
రెండూ IP రేటింగ్స్, Wi-Fi 7, Bluetooth 5.4/6.0, NFC, స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ లాంటి అన్ని ప్రీమియం ఫీచర్లు కలిగి ఉన్నాయి. OnePlus 13s లో ప్రత్యేకంగా IR సెన్సార్, 4 మైక్రోఫోన్లు ఉంటే, vivo X200 FEలో 90W ఛార్జింగ్, 5000 నిట్స్ బ్రైట్‌నెస్, ట్రిపుల్ కెమెరా ఉన్నాయి.

ధర, వేరియంట్లు:
వివో X200 FE ధర రూ. 54,999 (12GB+256GB) నుంచి రూ.59,999 (16GB+512GB) వరకు ఉండగా.. OnePlus 13s ధర కూడా అదే స్థాయిలో రూ.54,999 నుంచి రూ.59,999 వరకు ఉంటుంది. అందుకే ధర పరంగా ఎలాంటి తేడా కనపడడం లేదు.
మొత్తంగా.. మీకు కెమెరా ప్రాధాన్యత అయితే Vivo X200 FE బెస్ట్ ఎంపిక. ఎందుకంటే ఇందులో హై బ్రైట్‌నెస్, పెద్ద బ్యాటరీ, పెరిస్కోప్ జూమ్ లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కానీ మీరు డిజైన్, ప్రాసెసింగ్, OS అప్డేట్స్ విషయంలో నమ్మకంగా ఉండాలనుకుంటే OnePlus 13s కొంచెం ముందంజలో ఉంటుంది. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టు ఉపయోగం మీద ఆధారపడి ఎంపిక చేయడం ఉత్తమం.