Site icon NTV Telugu

Hyderabad: ఇంటి దొంగ దొరికిందోచ్.. బెట్టింగ్‌కి బానిసై అన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ సోదరి..

Theft

Theft

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. కానీ.. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇట్టే పట్టేసుకున్నారు. వాస్తవానికి.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని శిర్డీ హిల్స్‌లో చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో దొంగతనం చేసినవారు ఎవరూ కాదండీ.. బాధితుడి సొంత సోదరిదే..! సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి అసలైన నిజాన్ని బయటపెట్టారు. జూలై 5వ తేదీన సుబ్రహ్మణ్యం శ్రీకాంత్ అనే యువకుడు కార్ పూజ కోసం కార్మంగాట్ వెళ్లగా, అతని ఇంట్లో చోరీ జరిగింది. అనుమానాస్పదంగా ఉన్న విషయాలను అన్వేషించిన పోలీసులు షాకయ్యే నిజాలను గుర్తించారు. శ్రీకాంత్ సోదరి.. ఆన్‌లైన్ బెట్టింగ్, కాసినో అడ్డాల్లో బాగా అలవాటుపడి సుమారు 5 లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. కుటుంబ సభ్యులు ప్రతీ వారం కార్మంగాట్‌కు వెళ్లే విషయాన్ని ఆమె గమనించి, అత్త బ్యాగులో నుంచి ఇంటి తాళాల్ని దొంగలించింది. అనంతరం తన స్నేహితులు కార్తీక్, అఖిల్ సాయంతో ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశారు.

READ MORE: Mahesh Kumar Goud: రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా..?

మొత్తం 12 తులాల బంగారం, వెండి వస్తువులు, నగదు అపహరించారు. వాటిలో కొంత బంగారాన్ని అటికా గోల్డ్ లోన్‌కు ఇవ్వడం ద్వారా అప్పులు తీర్చే ప్రయత్నం చేశారు. ఇంటి పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికల్ని గుర్తించిన పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారిచే ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన జగద్గిరిగుట్ట ఎస్‌హెచ్‌ఓ పి. నరేందర్ రెడ్డి, క్రైమ్ సిబ్బందిని డీసీపీ బాలానగర్ కె. సురేష్ ఐపీఎస్ ప్రశంసించి, వారికి బహుమతి అందించారు.

READ MORE: AP Deputy CM Pawan: గ్రామాల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు..

Exit mobile version