Sir Madam Trailer: విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన కొత్త చిత్రం ‘సర్ మేడమ్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ చూసిన వెంటనే ప్రేక్షకుల్లో “అయ్యో బాబోయ్.. ఈ భార్యాభర్తలు ఏంట్రా ఇలా ఉన్నారు?” అనేలా ఉన్నా.. ఓ వినోదభరితంగా సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతుంది. ఈ సినిమాలో సేతుపతి, నిత్యామీనన్ భార్యాభర్తలుగా నటిస్తుండగా.. వారి మధ్య హాస్యప్రధాన సన్నివేశాలు ట్రైలర్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ప్రత్యేకించి విజయ్ సేతుపతి డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ ట్రైలర్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.
Read Also:US Deports: 1,563 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. కేంద్రం అధికారిక ప్రకటన
ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఇది కేవలం ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు.. భార్యాభర్తల మధ్య సంబంధాలను, సామాజిక వ్యవహారాలపై ఒక మెస్సేజ్‌ను కూడా చక్కగా ప్రదర్శించబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్, టీజీ త్యాగరాజన్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన శ్రావ్యమైన సంగీతంతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. అలాగే ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘సర్ మేడమ్’ చిత్రం జూలై 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది.
Pavel Durov: భవిష్యత్‌పై టెక్ దిగ్గజాల సూచన.. వైరల్ పోస్ట్..!