NTV Telugu Site icon

Shock to TDP: టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే!

Nallagatla Swamidas

Nallagatla Swamidas

Shock to TDP: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక కసరత్తులో వైసీపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. కేశినేని నాని అనుచరుడు, తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరికకు లైన్ క్లియర్ అయింది. టీడీపీ మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాస్‌ వైసీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

Read Also: Tiruvuru MLA: పార్టీకి దూరంగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి!.. సీఎంవో నుంచి ఫోన్‌..

స్వామి దాస్‌తో పాటు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ వచ్చారు. ఇదిలా ఉండగా.. టీడీపీలో చేరేందుకు తిరువూరు వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రక్షణ నిధి సన్నద్ధం అవుతున్నారు. 1994, 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా స్వామి దాస్ గెలిచారు. అనంతరం 2004, 2009, 2014లో వరుసగా మూడు సార్లు స్వామి దాస్ ఓటమి పాలయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి అనుచరుడిగా ఉన్న నల్లగట్ల స్వామిదాస్‌కు తిరువూరు స్థానాన్ని కేటాయించాలని కేశినేని నాని వైసీపీ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. కేశినేని టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నల్లగట్ల స్వామిదాస్ కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.