సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపంలోని మోనిత పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఆ సీరియల్ లో విలన్ గా నటించింది.. ఆ పాత్రలో జీవించింది.. ఒక్కమాటలో చెప్పాలంటే డాక్టర్ బాబు,వంటలక్క కన్నా మోనిత పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.. అందుకే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఐడియా క్రేజ్ తో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టింది.. అక్కడ కూడా సీరియల్ లో మోనితలాగే ఫైర్ అయ్యింది శోభా శెట్టి.. అదే ఆమెకు మైనస్ అయ్యింది.. కేరీర్ కు బ్రేక్ పడేలా చేసిందనిశోభా శెట్టి ఓ పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇకపోతే తాజాగా కార్తీకదీపం 2 సీరియల్ మొదలు కాబోతుంది.. ఆ సీరియల్ ప్రోమోను రిలీజ్ చేశారు టీమ్.. అందులో మోనిత కనిపించలేదు.. కార్తీకదీపం 2 లో తనకు అవకాశం రాలేదంటూ స్వయంగా శోభ శెట్టి చెప్పుకొచ్చింది.. కార్తీకదీపం 2 లో నాకు ఆఫర్ దక్కలేదు.. బిగ్ బాస్ హౌస్ లో నన్ను విలన్ గా చూశారు. కార్తీకదీపం లో నన్ను మోనితగా ఎలా చూశారో.. హౌస్ లో కూడా అలానే చూసారు.. కార్తీకదీపం 2 ప్రోమో చాలా బాగుంది.. అయితే ఈ సీరియల్ లో నేను నటించడం లేదు… బిగ్ బాస్ వల్ల తన కేరీర్ కు బ్రేక్ పడిందని చెప్పకనే చెప్పింది..
ఇకపోతే బిగ్ బాస్ లో ఫైనల్ వరకు ఉండి బాగానే సంపాదించింది.. దాంతో వచ్చిన డబ్బులతో తన కలలను నెరవేర్చుకుంది.. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.. అలాగే కొత్త ఇల్లును కొనేసింది.. అంతేకాదు ఇప్పుడు పలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక ముందు సీరియల్స్ చేస్తుందా.. లేక సొంత వ్యాపారాల పై ఫోకస్ పెడుతుందా అనేది తెలియాల్సి ఉంది..