Shivaji: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై విభిన్న శైలిలో చర్చలు ఊపందుకున్నాయి. దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పొరపాటున శివాజీ మాట్లాడిన రెండు మాటల వల్ల ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలు పెద్ద ఎత్తున మండిపడుతూ సోషల్ మీడియాలో వారి మనోభావాలను తెలుపుతున్నారు. ఈ దెబ్బతో నటుడు శివాజీ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ముందుగా తాను అన్న మాటలకు క్షమాపణలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ..
జరిగిన తప్పుకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను మాట్లాడిన ఇంటెన్షన్ వేరు. జడ్జ్ అయినా.. ఎవరైనా ఇంటెన్ష్ చూస్తారు. నాకంటే పెద్ద పదాలను ఎవరూ వాడలేదు. నన్నే ఎందుకు మీరు. అమరావతి రైతులపై బూటు కాలు వేసి తొక్కినప్పుడు నేను మాట్లాడాను. నేను నిలబడ్డాను. ఎన్నో సందర్భాలో నిలబడ్డాను. జెన్ జీ కోసం నాయకులతో ఫైట్ చేశాను. నేను క్షమాపణ చెప్పానని అన్నప్పటికీ ఉమెన్ కమీషన్ వాళ్లు డిసెంబర్ 27న రమ్మని చెప్పారు. పర్లేదు.. నేను వెళ్లి క్షమాపణ లేఖ ఇస్తాను. నేనేం సిగ్గు పడనని ఆయన అన్నారు.
Shivaji Press Meet: నేను ఎవరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు.. నా భార్యకు క్షమాపణలు చెప్పాను..
పూర్తి కమర్షియల్ తెలుగు సినిమాగా తెరకెక్కిన దండోరా.. గ్రామీణ కథతో పాటు కుల వ్యవస్థ, సామాజిక అసమానతలపై స్పష్టంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మురళీకాంత్ దర్శకత్వం వహించగా లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మాణికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు నటించారు. సమాజంలోని నిజాలను ప్రశ్నించే కథతో డండోరా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం.. ఏడాది చివర్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించి వైవిధ్యమైన సినిమాగా ప్రేక్షకులను పలకరించనుంది.