Shiva Karthikeyan: కెరీర్ మొదట్లో కామెడీ క్యారెక్టర్లు చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చారు శివ కార్తికేయన్. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ.. పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు. శివకార్తికేయన్ జంతు ప్రేమికుడు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. గతంలోనూ పలు జంతువులను దత్తత తీసుకున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు సింహాన్ని దత్తత తీసుకున్నాడట. వండలూరులోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో ‘షేరు’ అనే పేరు గల మూడేళ్ల వయసున్న సింహాన్ని దత్తత తీసుకున్నారు. శివ కార్తికేయన్ ఆ సింహాన్ని ఆరు నెలల కాలానికి దత్తత తీసుకున్నారు. అయితే ఇలా జంతువులపై తమ అభిమాన నటుడు చూపిస్తున్న ప్రేమ పట్ల శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇదే జూలాజికల్ పార్క్ నుంచి 2021 సెప్టెంబర్‌లో ‘విష్ణు’ అనే సింహాన్ని, ‘ప్రకృతి’ అనే ఏనుగును ఆర్నెళ్ల పాటు అడాప్ట్ చేసుకున్నారు.
Read Also:Minister KTR: నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన..
Just IN:
One Lion adopts another Lion🦁
Self made star #SivaKarthikeyan adopts a Lion at Arignar Anna Zoological Park, Vandalur.
A 3-year-old male lion named Sheru has been adopted by the actor.
The star has adopted the Lion for six months.
Kudos @Siva_Kartikeyan for this… pic.twitter.com/LiJLp4Fgu1
— Manobala Vijayabalan (@ManobalaV) June 29, 2023
Read Also:Selfi Problem: సెల్ఫీ తెచ్చిన కష్టాలు.. బదిలీ అయిన పోలీసు అధికారి
ఇక శివ కార్తికేయన్ పక్కింటి కుర్రాడి తరహా పాత్రల్లో సులువుగా జీవించేస్తారు. ఎందుకంటే తాను చాలా కింది స్థాయి నుంచి ఎదిగి పైకొచ్చారు. ఆర్జేగా కెరీర్ మొదలుపెట్టి యాంకర్‌గా, ఆ తర్వాత స్టార్‌గా ఎదిగారు. అందుకే ఆయన పోషించే పాత్రలు కూడా సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే ప్రస్తుతం శివ రూట్ మార్చి కొత్త జోనర్‌లో సినిమాలకు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘మావీరన్, అయాలాన్’ ఆ కేటగిరీలోనివే. సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ‘అయాలాన్’ మూవీకి ఆర్ రవికుమార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో 4500కి పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.. ఇంతవరకు ఇండియాలో నిర్మించిన సినిమాల్లో ఇదే అత్యధికం. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మడోన్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ‘మావీరన్’.. యాక్షన్ మూవీ. ఇందులో అదితి శంకర్, మిస్కిన్, యోగి బాబు నటిస్తున్నారు.