Shine Tom Chacko: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన షైన్ టామ్ చాకో పేరు వినిపిస్తుంది. పేరు వింటే కొత్తగా అనిపిస్తుంది కదా.. ఫేస్ చూస్తే తెలిసిపోతుంది లెండి. ఇప్పుడిప్పుడే తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు. నాని నటించిన దసరా సినిమాలో మెయిన్ విలన్ గా నటించి.. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక మొదటి సినిమాతోనే స్టార్ విలన్స్ లిస్ట్ లో చేరిపోయి.. దేవర సినిమాలోనే ఛాన్స్ పట్టేశాడు. ఇక ఎప్పుడైతే ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా సెలెక్ట్ అయ్యాడో .. అప్పటినుంచి మనోళ్లు ఈ నటుడిపై ఓ కన్నేశారు. ఇంకేముంది చాకో గురించి తెలుసుకొని ఇప్పుడు షాక్ అవుతున్నారు. అవును మరి.. ఈ బాబు చేసే పనులు చూస్తుంటే.. మన బాలయ్య బాబు గుర్తురాక మానడు అని చెప్పుకొస్తున్నారు.
Sharwanand : మెగా లిటిల్ ప్రిన్సెస్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన శర్వానంద్..
బాలయ్యకు కోపం వస్తే ఫోన్లు ఎలా విసిరిగొడతాడో.. చాకో కూడా తనకు నచ్చకపోతే సందర్భంగా ఏంటి.. ఎక్కడ ఉన్నాం అన్న విషయం కూడా మర్చిపోతాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చాకో.. యాంకర్ తో మాట్లాడుతూ ఫోన్ విసిరిగొట్టిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇంటర్వ్యూలో చాలాసార్లు ఫోన్ పగలకొట్టడం చేసాడట. ఈ విషయంలోనే బాలయ్యకు పోటీగా ఉన్నాడే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. దేవర రిలీజ్ కాకముందే మనోడు ఇలా ఉంటే.. రేపు దేవర రిలీజ్ అయ్యి.. ఇంటర్వ్యూకు పిలిస్తే.. ఏ రేంజ్ లో చేస్తాడో అని అభిమానులు నవ్వుకుంటున్నారు.