గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన భార్య ఉపాసన జూన్ 20 వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు మెగా కుటుంబంలో కి ఆహ్వానం పలికారు.ప్రస్తుతం తమ బేబీ తో ఈ లవ్లీ కపుల్ ఫుల్ ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. బేబీ పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ రాంచరణ్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ బేబీ నీ ముద్దుగా మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.అలాగే నేడు మెగా లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుక జరగబోతున్నట్లు సమాచారం.ఇందుకు మెగా కాంపౌండ్ లో ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ కూతురు కోసం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ స్పెషల్ గిఫ్ట్ పంపాడనీ సమాచారం.రామ్ చరణ్ మరియు శర్వానంద్ చైల్డ్ హుడ్ నుంచి ఎంతో మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో కూడా శర్వానంద్ కి మంచి అనుబంధం ఉంది.ఇటీవల జరిగిన శర్వానంద్ పెళ్లి మరియు రిసెప్షన్ వేడుకల్లో కూడా రామ్ చరణ్ దంపతులు సందడి చేసిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా శర్వానంద్ రామ్ చరణ్ కూతురి కోసం ఖరీదైన బ్రాండెడ్ బేబీ ప్రొడక్ట్స్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం.అలాగే పాపకు దుస్తులు మరియు బొమ్మలు అంతేకాదు చిన్నారి కోసం లక్ష్మీదేవి లాకెట్ ఉన్న గోల్డ్ చైన్ ను కూడా గిఫ్ట్ గా ఇచ్చాడనీ సమాచారం.. ఇక శర్వానంద్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ చూసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎంతగానో మురిసిపోయారని సమాచారం.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.