Shashi Tharoor: బీజేపీ 400 సీట్ల నినాదం ఫలించింది.. మన దేశంలో కాదు..!
- 14 ఏళ్ల తర్వాత మరోసారి అధికారంలోకి లేబర్ పార్టీ..
- ప్రధాని మోడీ.. బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సెటైర్లు..
- బీజేపీ 400 సీట్ల నివాదం ఫలించింది.. మన దేశంలో కాదు: శశి థరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు ఏకంగా 412 సీట్లను ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం.. మొత్తానికి ఇప్పడు నిజమైందంటూ ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ ‘అబ్ కీ బార్, 400 పార్’సాధ్యమైందన్నారు. కానీ, అది భారతదేశంలో కాదు.. మరో దేశంలో సాధ్యం అయిందని ట్విట్టర్ వేదికగా బీజేపీపై శశి థరూర్ సెటైర్ వేశారు.
Read Also: Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అరెస్ట్
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు విజయంచడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. తాము తప్పకుండా 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదాన్ని చెప్పుకొచ్చారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 240 సీట్లు, ఎన్డీయే కూటమితో కలిపి 293 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల సహాయంతో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక, కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో గెలవగా.. ఇండియా కూటమి 234 స్థానాలను కైవసం చేసుకుంది. కాగా, బ్రిటన్‌లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీ 2019లో 211 సీట్లలో విజయం సాధించగా.. ఈసారి 412 సీట్లను గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!