జూన్ 4 తర్వాత కూడా విపక్షాల కూటమి కలిసి ఉండాల్సిందేనని మహారాష్ట్ర సీనియర్ నేత శరద్ పవార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జనతాదళ్ యునైటెడ్ చీఫ్ నితీష్ కుమార్‌ను ‘అవకాశవాది’ అని కూడా అభివర్ణించారు. కలిసి పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది తప్పదన్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) రాష్ట్రంలోని 10 స్థానాల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
Read Also: Prakash Raj: మార్పుకోసం.. నేను ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేశాను : ప్రకాష్ రాజ్
ఇక, బారామతి సీటు పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ సీనియర్ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం గురించి పవార్ మాట్లాడుతూ.. నాకు వచ్చిన సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించి సుప్రియను ఓడించేందుకు కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. అలాగే, శివసేన, భారతీయ జనతా పార్టీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కలిసిన మహాయుతి కూటమి తరపున బారామతి స్థానం నుంచి అజిత్ భార్య సునేత్రా పవార్‌ను ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు.
Read Also: Gastric Problem : రోజుకో గ్లాసు ఈ నీటిని తాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం
అయితే, తన మేనల్లుడు అజిత్ పవార్, నరేంద్ర మోడీతో కలిసి బీజేపీలో ఉన్నంత కాలం ఆయనతో సయోధ్య గురించి ఆలోచించబోమని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ చెప్పారు. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడంలో.. తాము విజయం సాధించామని, కేంద్రంలో ఉండడం వల్లే అలా చేయగలిగామని బీజేపీ చెప్పుకొస్తుందన్నారు. అయితే, నరేంద్రమోడీ ఆలోచనా విధానం భిన్నంగా ఉంది.. ఒక వేళా అటల్ బిహారీ వాజ్‌పేయి అధికారంలో ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవారు కాదు అని శరద్ పవార్ వెల్లడించారు.
