NTV Telugu Site icon

Sharad Pawar: ప్రధాని మోడీ నా వేలు పట్టుకుని రాజకీయాలు నేర్చుకున్నారు..

Sharad

Sharad

Lok Sabha Election 2024: ప్రధాని నరేంద్ర మోడీపై మహారాష్ట్ర సీనియర్ నేత శరద్ పవార్ మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ ప్రసంగాల్లో వాస్తవాలు లోపించాయని అన్నారు. వాస్తవాలకు అతీతంగా ప్రసంగాలు చేసే ప్రధానిని ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదని చెప్పుకొచ్చారు. నన్ను, ఉద్ధవ్ ఠాక్రేను టార్గెట్ చేయడం ద్వారానే నరేంద్ర మోడీ సంతృప్తి చెందారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఐదు విడతల లోక్‌సభ ఎన్నికలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. మోడీ ఇక్కడ సాధ్యమైనంత వరకు ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తెస్తుందని ప్రధాని పదే పదే అసత్య ప్రచారం చేస్తున్నారని శరద్ పవార్ వెల్లడించారు.

Read Also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

ఇండియా కూటమి ఎప్పుడూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తెస్తుందని చెప్పలేదని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ మహారాష్ట్రను బలిపశువుగా మార్చబోతున్నారని మండిపడ్డారు. కాగా, ఇటీవల శరద్ పవార్ కూడా ఒకప్పుడు ప్రధాని మోడీ నా వేలు పట్టుకుని రాజకీయాలు నేర్చుకున్నారని అనడం గమనార్హం. కానీ, ఈరోజు అతను పూర్తిగా మారిపోయాడు.. గతంలో ఉన్నట్లు లేడని చెప్పారు. అలాగే, ఇటివలే కూడా ఒక ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శరద్ పవార్ పోల్చారు.