Site icon NTV Telugu

Shanmukh Jaswanth : డిప్రెషన్ మోడ్ గాయబ్.. కొత్త లవర్’ను పరిచయం చేసిన షణ్ముఖ్

Shannu

Shannu

షణ్ముఖ్ జస్వంత్ అంటే ఒక సోషల్ మీడియా సెన్సేషన్. యూట్యూబర్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. అయితే అతని వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా షణ్ముఖ్ తన లైఫ్‌లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన.. ఒకప్పుడు ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పక్కర్లేదు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు చేసిన కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ నెట్టింట అనునిత్యం వైరల్ అయ్యేవి. అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు మారాయి. హౌస్‌లో మరో కంటెస్టెంట్ సిరి హన్మంతుతో షణ్ముఖ్ క్లోజ్‌గా ఉండటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ రావడంతో, షణ్ముఖ్ బయటకు వచ్చిన కొద్ది రోజులకే దీప్తి సునయన తన బ్రేకప్‌ను అధికారికంగా ప్రకటించింది.

Also Read: Dhurandhar2 : ధురంధర్ 2 దెబ్బకు దుకాణం సర్థుకుంటున్న బాలీవుడ్ సినిమాలు

అయితే బ్రేక్ అప్ తర్వాత షణ్ముఖ్ చాలా కాలం పాటు డిప్రెషన్‌లో ఉన్నట్లు కనిపించాడు. సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగా ఉన్నాడు. అయితే నెమ్మదిగా కోలుకుంటూ మళ్ళీ వర్క్ మొదలుపెట్టాడు. ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ వంటి వెబ్ సిరీస్‌లతో పాటు ప్రస్తుతం ఒక సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా షణ్ముఖ్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఒక అమ్మాయి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఆమె పేరును నేరుగా వెల్లడించలేదు కానీ, ‘V’ (వి) అనే అక్షరంతో పేరు మొదలవుతుందని హింట్ ఇచ్చాడు. “మై వరల్డ్” అనే అర్థం వచ్చేలా ఎమోజీలను జత చేశాడు. దీంతో షణ్ముఖ్ మళ్ళీ ప్రేమలో పడ్డాడని, ఆ ‘V’ అనే అమ్మాయి ఎవరా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చాలా కాలం తర్వాత షణ్ముఖ్ మళ్ళీ సంతోషంగా కనిపిస్తుండటంతో అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలియాలంటే షణ్ముఖ్ స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి.

Exit mobile version