షాలినీ పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినీ కెరీర్ టాలీవుడ్ లోనే మొదలయింది.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నే ఈ భామ కు మొదటి చిత్రం.తన మొదటి సినిమా తోనే షాలినీ పాండే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ తోనే తెలుగు ఇండస్ట్రీ లో వరుస ఆఫర్లు అందుకుంది. ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’ మూవీస్ అంతగా ఆకట్టుకోలేదు.అదే సమయంలో తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం హిందీ లో సినిమాల్లో నటిస్తూ బిజీ గా వుంది.ఈ బ్యూటీకి స్టార్ హీరోల సరసన ఆఫర్లు రాకపోయినా.. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటోంది. షాలినీ ప్రస్తుతం హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘మహారాజా’అనే చిత్రంలో నటిస్తోంది.ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ దర్శకనిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.నెట్టింట వరుసగా హాట్ పిక్స్ షేర్ చేస్తుంది ఈ బ్యూటీ.. స్టన్నింగ్ ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మైండ్ బ్లోయింగ్ పోజులిస్తూ రెచ్చగొడుతుంది.. ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ట్రెండీ వేర్స్ లో మెరిసింది. డెనీమ్ జీన్స్, బ్రా కనిపించేలా ట్రాన్స్ ఫరెంట్ టాప్ ధరించి తన హాట్ అందాల విందు చేసింది. మత్తుగా ఫొటోలకు ఫోజులిచ్చింది.స్లిమ్ గా మారిన ఈ భామ నాభీ, నడుము అందాలు చూపిస్తూ మతి పోగొట్టింది . ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి