ప్రపంచంలోనే అతిపెద్ద సినీమా సూపర్‌స్టార్‌లలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఒక్క భారత దేశంలోనే కాదు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘కింగ్ ఖాన్’గా పేరుగాంచిన షారుఖ్ బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు షారుఖ్ సినిమా కేరీర్ ను ప్రారంభించినప్పుడు అతనికి వివేక్ వాస్వాని సహాయం చేసాడు.. అతను తన కెరీర్‌ను స్టార్ట్ చేయడంలో సహాయపడటమే కాకుండా అతనికి ఉండడానికి ఒక ఇంటిని కూడా ఇచ్చాడు. అయితే వీరిద్దరూ కొన్నాళ్లుగా కలుసుకోలేదు.. వీరిద్దరి మధ్య మాటల్లేవని తెలుస్తుంది..
వివేక్ 2018లో సూపర్ స్టార్ పుట్టినరోజున షారూఖ్ ను చివరి సారి కలుసుకోవడం గుర్తుచేసుకున్నాడు.. నేను నాలుగేళ్ల క్రితం అతని పుట్టినరోజు పార్టీకి వెళ్ళాను. ఆ పార్టీలో చాలా సరదాగా గడిపాము. అదే చివరి మీటింగ్.ఆ తర్వాత షారూఖ్‌ను ఎందుకు కలవలేదు అనే దాని గురించి వివేక్ మాట్లాడుతూ.. అతని వద్ద 17 ఫోన్‌లు ఉన్నాయి.. అయితే నా దగ్గర ఒక నంబర్ మాత్రమే ఉంది.ఆ నంబర్ కు చేస్తే అతను లిఫ్ట్ చెయ్యలేదు.. జవాన్ తర్వాత నేను అతనికి మళ్లీ కాల్ చేసాను.. కానీ అతను లిఫ్ట్ చెయ్యలేదు.. షారుఖ్ ఎప్పుడూ టూర్లకు వెళ్తుంటాడు.. అతనికి బాధ్యతలు కూడా ఉన్నాయి. అతను ఒక సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు.. ఆ తర్వాత దీని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు..
మేము ప్రత్యేకంగా కలవము.. ఏదోక సందర్బంగా కలిసినప్పుడు మాత్రం మాట్లాడతాము.. నేను సబర్బనిటీని కాదు. నేనొక ఉపాధ్యాయుడిని. నేను ఒక స్కూల్ డీన్ ని. నేను రోజుకు 18 గంటలు పని చేస్తాను. నేను బస్సులో, లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తాను.. షారూఖ్ సూపర్‌స్టార్. వారితో కలవాలని కూడా ఎప్పుడూ అనుకొనని చెప్పాడు.. ఇక షారుఖ్ ఖాన్ చివరిసారిగా రాజ్‌కుమార్ హిరానీ యొక్క డుంకీలో కనిపించాడు. అతను త్వరలో టైగర్ వర్సెస్ పఠాన్‌లో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్‌ను పంచుకోనున్నాడు. పఠాన్ 2 లో నటిస్తున్నారు..