Jawaan: మళ్లీ లీకయిన ‘జవాన్’ క్లిప్.. పోలీసులకి ఫిర్యాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan Jawan Movie Clip Leaked Again: షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ జవాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక అంతేకాక సినిమా మీద క్యూరియాసిటీని పెంచేందుకు మేకర్స్ ప్రతి చిన్న విషయాన్ని వదలడం లేదు. ఇక ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ముందే మేకర్స్‌కి పెద్ద షాక్ తగిలిందని అంటున్నారు. అదేమంటే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్స్ మేకర్స్ నుంచి దొంగిలించబడ్డాయని ఆ తరువాత ఆన్‌లైన్‌లో లీక్ చేశారని అంటన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కాపీరైట్ ఉల్లంఘన గురించి గురువారం శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం, ఆగస్టు 10న, ఐటీ చట్టం కింద, ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌లో షారుఖ్ కంపెనీ రెడ్ చిల్లీస్ తరపున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
Ankita Lokhande: సుశాంత్ మాజీ ప్రియురాలి ఇంట తీవ్ర విషాదం
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
జవాన్ నుండి లీక్ అయిన క్లిప్‌లను షేర్ చేసిన ఐదు ట్విట్టర్ హ్యాండిల్స్‌ను మేకర్స్ గుర్తించారని, వారికి లీగల్ నోటీసులు కూడా పంపినట్లు చెబుతున్నారు. ఒక ట్విట్టర్ హ్యాండిల్ నోటీసులు అంగీకరించినట్లు సమాచారం. జవాన్ క్లిప్ లేదా ఫోటో ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఇది మొదటి సారి కాదు మూడోసారి. కొన్ని నెలల క్రితం, ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఫైట్ చేసున్న ఒక స్లో-మోషన్ యాక్షన్ సీక్వెన్స్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లీక్ అయింది. ఆ సమయంలో రెడ్ చిల్లీస్ క్లిప్‌లను తొలగించాలని కోర్టును ఆశ్రయించింది. తరువాత, ఈ సినిమా నుంచి షారుఖ్ ఖాన్ బట్టతల లుక్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్, వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతితో పాటు దీపికా పదుకొణె కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ జవాన్ సెప్టెంబర్ 7న భారతదేశ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!