NTV Telugu Site icon

Shabbir Ali : గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండి

Shabbir Ali

Shabbir Ali

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్‌ఎస్‌ పనికట్టుకుని బురద జల్లే పనిలో పడ్డారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వాళ్ళమని, కానీ కేటీఆర్.. హరీష్ లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కనిపించడం లేదు.. ప్రతిపక్ష నాయకుడు ఎవరు అనేది అర్దం అవ్వడం లేదని ఆయన అన్నారు. గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండని, నేను ప్రతిపక్ష నేతగా ఉంటే.. నా వెంట ఉన్న ఆరుగురు ఎమ్మెల్సీలు లాక్కున్నారన్నారు. గంట సమయం ఇవ్వకుండా నా సెక్యూరిటీ.. బుల్లెట్ ప్రూఫ్ తీసేశారని, మళ్ళీ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు షబ్బీర్‌ అలీ. 48 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసింది మీరు అని, తలసాని టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ప్రమాణం చేయించారన్నారు. అప్పుడు గుర్తు లేదా.. సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

Balakrishna : హీరోయిన్లకి మించిన అందం.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బాలయ్య కుమార్తెలు
మా పార్టీ ఇప్పటి వరకు ఎప్పుడు అలా చేయలేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ హయంలో మైనార్టీలకు ఏం చేశారు, మైనార్టీలకు మెడికల్ కాలేజి ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీలతో ఇండ్లు ఇచ్చేందుకు జీఓ ఇచ్చారని, సోషల్ మీడియా లో ఇందిరమ్మ కమిటీల పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లకు సిగ్గు శరం ఉండాలని, పిచ్చి మాటలు మాట్లాడకండన్నారు. మైనార్టీల కోసం183 సీట్ల లా కాలేజి ఇచ్చామని, 2 ఫార్మసీ కాలేజీలు ఇచ్చామన్నారు. కేసీఆర్ కాలేజీలు మూసేశారు.. మేము తెరిపించే పనిలో ఉన్నామన్నారు. కేటీఆర్.. హరీష్ లకు డీఎస్సీ ఎలా వేయాలి..? తెలుసా మీకు.. గ్రూప్ పరీక్షలు ఎలా పెట్టాలి అనేది తెలుసా..? మేము డీఎస్సీ..గ్రూప్స్ ఎలాంటి వివాదం లేకుండా వేస్తున్నాం..మీ కంటికి కనిపించడం లేదా..? అని షబ్బీర్‌ అలీ అన్నారు.

అంతేకాకుండా..’తెలంగాణ నీ లూటీ చేసిన దొంగలు బీఆర్‌ఎస్‌ వాళ్ళు, దొంగల గురించి ఏం మాట్లాడాలి. గురుకులాల కి లాక్ లు వేయడం కరెక్ట్ కాదు. మూడేళ్లు కేసీఆర్ ఇవ్వలేదు బకాయిలు. బీఆర్‌ఎస్‌ నేతలు.. వెంటపెట్టుకుని తాళాలు వేయించారు. కాంగ్రెస్ నీ బదానం చేసే పనిలో బీఆర్‌ఎస్‌ ఉంది. మోడీకి రేవంత్.. నేను భయపడము, ఈడీ విచారణకు ఇద్దరం వెళ్లినం.. మమ్మల్ని వదిలేయలేదు. మీరు వెళ్ళారా ఈడీకి, కోడి గుడ్డుకు ఇచ్చే పైసలు కూడా కేసీఆర్ పెండింగ్ పెట్టిండు, మూడేళ్లు గా బిల్లులు ఇవ్వకుండా ఆపింది కేసీఆర్. మూసీపై ఇంకా డీపీఆర్‌ కాలేదు, మీలాగా డీపీఆర్‌ లేకుండా ప్రాజెక్టులు కట్టం. డీపీఆర్‌ కాకుండా పని చేస్తే.. మేమే మా ప్రభుత్వాన్ని అడుగుతాం’ అని షబ్బీర్‌ అలీ అన్నారు.

Annamaya District: గుప్త నిధుల కోసమా..? మరేదైనా కారణమా.. అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత