NTV Telugu Site icon

Gurpatwant Singh Pannun: “భారత్ అందుకే నన్ను చంపాలనుకుంటోంది, అమెరికానే కాపాడాలి”.. ఖలిస్తాన్ ఉగ్రవాది..

Khalistan

Khalistan

Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ ప్లాన్ చేసిందని, అయితే అమెరికా ఈ కుట్రను భగ్నం చేసిందని ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై అమెరికా తన ఆందోళనను భారత్‌కి తెలియజేసింది. అమెరికా లేవనెత్తిన అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. పంజాబ్‌‌ని భారత్ నుంచి వేరు చేయాలనే ఉద్దేశంతో పన్నూ, కెనడా, అమెరికా, బ్రిటన్ వంటి చోట్ల ఖలిస్తాన్ రెఫరెండానికి మద్దతు ఇస్తున్నాడు. మరోవైపు ఇతనికి పాకిస్తాన్, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పన్నూ టైమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హత్యకు ప్లాన్ గురించి మాట్లాడారు. ఎయిర్ ఇండియాకు బెదిరింపుల గురించి అడిగినప్పుడు.. తాను ఎయిర్ ఇండియాను బహిష్కరించడండి అని చెప్పానని, అయితే భారత్ దీన్ని ‘బాంబు’ కథనంగా మార్చారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఖలిస్తాన్ రెఫరెండం చేస్తున్నందుకే తనను భారత ప్రభుత్వం చంపాలని అనుకుంటోందని ఆరోపించారు.

‘‘అమెరికా సార్వభౌమాధికారానికే ఇది సవాల్. ఇది అమెరికాలోని వాక్ స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు. దీనిపై యూఎస్ అధికారులు మరింత మాట్లాడాలని కోరకుంటున్నాను’’ అని గురుపత్వంత్ సింగ్ పన్నూ చెప్పారు. ప్రస్తుతం పన్నూకు అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా వ్యవస్థీకృత నేరస్తులు, ఉగ్రవాదుల మధ్య సంబంధాలపై అమెరికా తన ఇన్‌పుట్స్ పంచుకున్నట్లు భారత్ గత వారం తెలిపింది.

పన్నూ హత్యకు కుట్ర విషయాన్ని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అత్యున్నత స్థాయిలో భారత్‌తో పంచుకుంది. బాధ్యులు బాధ్యత వహించాలని చెప్పింది. అయితే ఈ విషయాన్ని భార‌త్‌కి చెప్పినప్పుడు ఆశ్చర్యం, ఆందోళన చెందిందని, ఇది తమ ప్రభుత్వ విధానం కాదని, విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు భారత్ చెప్పందని వైట్‌హౌజ్ ప్రతినిధి వెల్లడించారు.

Read Also: Uttarakhand Tunnel Rescue: అత్యాధునిక టెక్నాలజీ వల్ల కాలేదు.. ‘పురాతన ర్యాట్ హోల్ మైనింగ్’ 41 మందిని కాపాడుతోంది..

నేను ఖలిస్తాన్ అంశానికి మద్దతు ఇస్తున్నందుకు వారు తనను జీవించి ఉండాలని కోరుకోవడం లేదని, నేను టెర్రర్, టెర్రరిజం గురించి భారత్ కథనాలను శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సవాల్ చేయ చేయగలనని పన్నూ ఇంటర్వ్యూలో చెప్పాడు. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, 1994లో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ మరియు ఇతర ఏజెన్సీల నుండి 1984 నుండి 1995 వరకు ఏమి జరిగిందనే దాని గురించి నివేదికలు ఉన్నాయని, ఈ వివాదాస్పదమైన సమస్యపై 1950 నుంచి మేము ఎప్పుడూ శాంతియుత, ప్రజాస్వామ్య పరిష్కారం పొందలేదని పన్నూ అన్నారు. పంజాబ్ స్వతంత్ర దేశంగా ఉండాలా..? అని 1947 నుంచి పంజాబ్ ప్రజల్ని అడగలేదని ఇంటర్వ్యూలో పన్నూ వ్యాఖ్యానించాడు. జనవరి 26, 2024న పంజాబ్‌లో ఖలిస్తాన్ రిఫరెండం ఓటరు నమోదు ద్వారా మేము ఈ ప్రశ్నను లేవనెత్తబోతున్నాం అని ఆయన అన్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో భారత్ ఏం చేసిందో తాను చూశానని అన్నాడు.

కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత పన్నూ హత్య కుట్రకు సంబంధించి వార్తలు వెలుగులోకి వచ్చాయి. కెనడా ఈ ఆరోపణలు చేయడం వల్ల భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఆరోపణల్ని భారత్.. అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా ఖండించింది.

Show comments