Road Accident: భువనేశ్వర్ నుంచి జార్సుగూడకు బస్సు బయలుదేరింది. రాత్రి దట్టమైన చీకటిలో ప్రయాణం కొనసాగుతోంది. ఉన్నట్లుండి దారిలో బస్సు టైరు పంక్చర్ అయింది. దీంతో ప్రయాణికులు వాహనం దిగి రోడ్డుపై నిలబడ్డారు. అంతే వేగంగా వచ్చిన లారీ నలుగురు ప్రయాణికులపై దూసుకెళ్లింది. దీంతో గమ్యం చేరకముందే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంగోల్ జిల్లా సరిహద్దులో నిన్న(గురువారం) అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు.
Read Also:World Cup Final 2023: ఆ ట్రెండ్ కొనసాగితే.. భారత్‌దే 2023 ప్రపంచకప్!
అనుగోల్ జిల్లా కిషోర్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్గపాలి సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ఝార్సుగూడకు కాలీ ప్రాచి అనే ప్రైవేట్ బస్సు వెళ్తోంది. బర్గపాలి సమీపంలో అర్థరాత్రి దురదృష్టవశాత్తు బస్సు టైరు పంక్చర్ అయింది. ఏం జరిగిందో చూసేందుకు బస్సులోని ప్రయాణికులు బస్సు నుంచి దిగి బయటకు వచ్చారు. బయట వారి కోసం యముడు ఎదురు చూస్తున్నాడని పాపం ఊహించలేకపోయారు. ప్రయాణికులు బయట నిలబడి ఉండగా వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. నలుగురిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది.
Read Also:Revanth Reddy: నేడు కొడంగల్ కు రేవంత్.. కుత్బుల్లాపూర్ లో బహిరంగ సభ
గాయపడిన 4 మందిని పరిస్థితి విషమంగా ఉండడంతో మొదట కిషోర్ సిటీ ఆసుపత్రిలో చేర్చారు. వారందరి ఆరోగ్యం విషమించడంతో సంబల్‌పూర్ జిల్లా రెబాచోల్ ఆసుపత్రికి తరలించారు. కిషోర్ నగర్ ఆసుపత్రిలో ఒకరు మరణించగా, మిగిలిన ఇద్దరు రెబాచోల్ ఆసుపత్రిలో మరణించారు. మరొకరు ఇంకా చికిత్స పొందుతున్నారు. మృతులు సుందర్‌గఢ్‌కు చెందిన ఆనంద్ ప్రధాన్, జార్సుగూడకు చెందిన నయన్ నాయక్, ఘనశ్యామ్ బారిక్. గాయపడిన వ్యక్తిని త్రిలోచన్ నాయక్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.