Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- కర్ణాటకలో ఘోర విషాదం
- ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్యాంకర్
- ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విజయనగరలో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ను వెనుక నుంచి అత్యంత వేగంగా ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోగా… మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
విజయనగర జిల్లాలోని టీబీ డ్యామ్ సమీపంలో జాతీయ రహదారి 50పై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న ట్యాంకర్ వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఆ తీవ్రతకు రెండు వాహనాలు వంతెన పైనుంచి కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
Also Read
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా
- Bhojshala Case: "భోజ్‌శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Monsoon 2026: గుడ్‌న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
బాధితులు హుళిగెమ్మ ఆలయంలో పూజ చేసి ట్రాక్టర్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది విజయనగర జిల్లా, కుడ్లిగి తాలూకాలోని మారల్యాన్హళ్లి గ్రామానికి చెందినవారు కాగా.. మిగిలిన వారు బళ్లారి జిల్లా, సాండూర్ తాలూకాలోని యశ్వంత్ నగర్, కుడ్లిగి ప్రాంతంలోని అంకామన్నహళ్లి గ్రామానికి చెందినవారని తెలిసింది. ఈ ఘోర ప్రమాదంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్‌గా కొత్త సారథి.. సంజూ శాంసన్‌కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్‌పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్‌నే నమ్ముతున్న రష్యా
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!