T20 Captain: భారత టీ20 కెప్టెన్‌గా కొత్త సారథి.. సంజూ శాంసన్‌కు అవకాశం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టీ20 జట్టు తదుపరి కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరును బలంగా ప్రతిపాదించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం, ప్రస్తుతం బ్యాటింగ్‌లో చూపిస్తున్న నిలకడ శాంసన్‌ను ఒక అద్భుతమైన కెప్టెన్సీ అభ్యర్థిగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండు నెలల క్రితం స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో సంజూ శాంసన్ ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే 321 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచారు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్ నుండి న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ వరకు వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
రవిశాస్త్రి మాట్లాడుతూ.. “సూర్యకుమార్ యాదవ్ రాబోయే రెండేళ్లలో జట్టును ఎలా నడిపిస్తారనే దానిపై తదుపరి ప్రపంచకప్ (2028) కెప్టెన్సీ ఆధారపడి ఉంటుంది. అయితే సంజూ గతంలోనే రాజస్థాన్ రాయల్స్‌ను సమర్థవంతంగా నడిపించి తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన బ్యాటింగ్‌లో కనిపిస్తున్న పరిణతి చూస్తుంటే, భవిష్యత్తులో భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.
గతంలో సంజూ ఆట తీరుపై ఎన్నో సందేహాలు ఉండేవని, కానీ ఇప్పుడు వాటన్నింటినీ ఆయన తన ప్రదర్శనతో పటాపంచలు చేశారని శాస్త్రి అన్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజూ, 11 ఇన్నింగ్స్‌ల్లోనే 430 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఆయన ఆడిన 21 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 797 పరుగులు సాధించారు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం మెరుపు ఇన్నింగ్స్‌లే కాకుండా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడటం సంజూలో వచ్చిన గొప్ప మార్పు అని రవిశాస్త్రి కొనియాడారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!