Site icon NTV Telugu

Haryana: ఒకే కుటుంబానికి చెందిన 7 గురు ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో ఏం రాశారంటే..!

Suicide

Suicide

హర్యానాలోని పంచకులాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు సంచలన విషయాలు రాసుకొచ్చారు.

READ MORE: Realme Buds Air 7 Pro: 48 గంటల ప్లేబ్యాక్ తో.. రియల్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ విడుదల

స్థానిక పోలీసుల కథనం ప్రకారం..ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన ఈ కుటుంబం బాగేశ్వర్ ధామ్ బాబా ధీరేంద్ర శాస్త్రి చేసిన మతపరమైన ఉపన్యాసంలో పాల్గొనేందుకు సోమవారం పంచకుల వెళ్లింది. సెక్టార్ 27లోని ఓ ఇంటి సమీపంలో ఈ కుటుంబం ప్రయాణిస్తున్న కారును నిలిపారు. అదే కారులో ప్రవీణ్ మిట్టల్ కుటుంబ సభ్యులు మొత్తం విషం తాగారు. కారులో అలాగే కూర్చున్నారు. కారు డోర్ కు టవల్ వేలాడుతూ ఉండటాన్ని స్థానిక యువకుడు గమనించాడు. దగ్గరికి వెళ్లి ఏమైందో అని చూశాడు. కారులో ఆరుగురు వ్యక్తులు వాంతులు చేసుకుని ఒకరిపై ఒకరు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఏడో వ్యక్తి కష్టంగా శ్వాస తీసుకుంటూ కనిపించాడు. తమ కుటుంబం అప్పుల పాలైందని, అందుకే చనిపోతున్నామని చెప్పాడు. తాను కూడా మరో 5 నిమిషాల్లో చనిపోతానని ఆ వ్యక్తి యువకుడితో తెలిపాడు. ఆ యువకుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యంలో మృతి చెందాడు.

READ MORE: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావుకు నోటీసులు..

ఘటనా స్థలానికి చేరుకున్న పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, శాంతిభద్రతల డీసీపీ అమిత్ దహియా దర్యాప్తు చేపట్టారు. ఆరుగురిని ఓజాస్ ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు తమకు సమాచారం అందిందని పంచకుల డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) హిమాద్రి కౌశిక్ తెలిపారు. అందరూ చనిపోయారని తెలిపారు. కారులో సూసైడ్ నోట్ దొరికి నట్లు వెల్లడించారు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రూ.20 కోట్ల వరకు అప్పు ఉందని.. రూ.20 కోట్ల వరకు అప్పు ఉందని తెలిసింది. ప్రవీణ్ మిట్టల్ వ్యాపారంలో భారీగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. కొన్ని బ్యాంకుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు రాసుకొచ్చారు.

Exit mobile version