హర్యానాలోని పంచకులాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. దాదాపు 20 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు సంచలన విషయాలు రాసుకొచ్చారు.