Serial Actor Chandrakanth Love Story: బుల్లితెర నటుడు చంద్రకాంత్ (చందు) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్డు నం.20లో ఉన్న తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకున్నారు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి చంద్రకాంత్ బెంగళూరు నుంచి కారులో వస్తుండగా.. మహబూబ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్‌కు కూడా గాయాలయ్యాయి. పవిత్ర మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని.. పవిత్ర కోసం తన భార్యను చంద్రకాంత్ వదిలేశారు. ఈయన లవ్‌స్టోరి సినిమాను మించేలా ఉంది.
తన భార్యను శిల్పను స్కూల్ డేస్‌లోనే ప్రేమించమంటూ చంద్రకాంత్ 3 ఏళ్లు వెంటపడ్డారు. శిల్ప ఒప్పుకున్న తర్వాత 12 ఏళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించుకొని 2015లో వివాహం చేసుకున్నారు. త్రినయని సీరియల్లో పవిత్ర పరిచయం తర్వాత శిల్పకి చంద్రకాంత్ నరకం చూపించారు. కొన్ని నెలల పాటు శిల్పను రాత్రంతా కొట్టి టార్చర్ పెట్టారు. డైవర్స్ ఇచ్చేయమని వేధించారు. ఇద్దరు పసిబిడ్డలను ఉంచుకొని కూడా.. 20 ఏళ్లపై వయసున్న పవిత్ర పిల్లలను తన పిల్లలు అని కాలేజీల్లో తండ్రి స్థానంలో సంతకాలు చేశాడు. అయితే తండ్రిగా సొంత బిడ్డల ప్రోగ్రెస్ కార్డులో ఏ రోజు సంతకం చేయలేదు. చంద్రకాంత్, శిల్పకు ఇద్దరు పిల్లలు. పాప మూడవ తరగతి తడువుతుండగా.. బాబు ఎల్కేజీ. ఇటీవలి కాలంలో చంద్రకాంత్ తన పిల్లల మొహం కూడా చూడలేదు.
ఎటువంటి పని పాటు లేకుండా తిరుగుతున్న చంద్రకాంత్‌ని భార్య శిల్ప ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టించి.. ఒక దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చంద్రకాంత్ సీరియల్స్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి జీవితం మలుపు తిరిగింది. పవిత్రతో చంద్రకాంత్‌కు పరిచయం అయింది. వీరిద్దరి సంబంధం పట్ల టీవీలో నటించే తారలందరికి తెలుసు. పవిత్రకి అప్పటికే చాలా మందితో సంబంధాలు ఉన్నాయని చందుకు కొందరు వార్నింగ్ ఇచ్చినా ఎవరి మాట అతడు వినలేదు. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను పవిత్ర కోసం వదిలేశారు.
Also Read: Serial Actor Chandu: గత ఐదేళ్లుగా ఇంటికి రాలేదు.. మమ్మల్ని చూడలేదు: చందు తండ్రి
పవిత్ర అంత్యక్రియలను ఆమె అసలు భర్త చేశారు. పవిత్ర మరణంతో మానసికంగా కుంగిపోయిన చంద్రకాంత్.. ఆమె ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు. చంద్రకాంత్ గురువారం రాత్రి కూడా సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రకాంత్ ఎవరి ఫోన్ తీయలేదు. దాంతో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో పవిత్ర ఫ్లాట్ తలుపులు బద్దలుకొట్టి చూడగా చంద్రకాంత్ సూసైడ్ చేసుకుని ఉన్నారు.